ABN RK VS BRS
ABN RK VS BRS: అప్పుడు మందు బిల్లలు ఇచ్చే సంతోష్ ఇప్పుడు కేసీఆర్ వెంట పెద్దగా లేడనుకుందాం. పోనీ కవిత అయినా ఉందిగా.. అంతటి హరీష్ రావు కూడా ఉన్నాడు కదా.. లేకపోతే నంబర్ :2 కేటీఆర్ ఎలాగూ ఉన్నాడు కదా.. ఇంతమంది కాదని.. ఇంత మందిని కాదనుకొని హిమాన్షు రావు దగ్గర కెసిఆర్ సెల్ఫోన్ ఎలా వాడాలో మెలకువలు నేర్చుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే. ఇలాంటి వార్తలు ఆంధ్రజ్యోతిలో కనిపించడం మరింత ఆశ్చర్యకరమే.. పోనీ ఈ వార్తను మాస్టర్ హెడ్ పక్కన .. ఒక బాక్స్ పెట్టి ప్రజెంటేషన్ చేస్తే ఇంకా బాగుండేదేమో.. ఏమో ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో అన్ని ఇలాంటి వార్తలే వస్తున్నాయి.. సంపాదకీయం మార్పో.. కాల గతిలో వార్తల వల్ల వస్తున్న భయమో తెలియదు గాని.. మొత్తానికి ఈ వార్త ఆంధ్రజ్యోతిలో రావడం ఒకరకంగా సంచలనమే అని చెప్పవచ్చు.
ఆర్కే మీద పడ్డారు
ఆంధ్రజ్యోతిలో కెసిఆర్ పై ఈ వార్త రావడంతో భారత రాష్ట్ర సమితి నాయకులు.. ఆ పత్రిక ఓనర్ వేమూరి రాధాకృష్ణ మీద పడ్డారు. “మా సార్ కాలేశ్వరం కట్టాడు. తెలంగాణను విద్యుత్ వెలుగుల ప్రాంతంగా మార్చాడు.. బంగారు తెలంగాణను రూపొందించాడు. దేశానికి దారి చూపించాడు. అలాంటి మా బాపును పట్టుకొని ఫోన్ వాడటం రాదంటావా మిస్టర్ రాధాకృష్ణ..” అంటూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సోషల్ మీడియాలో రాధాకృష్ణను తెగ ఏసుకుంటున్నారు. రాధాకృష్ణ రెండో పెళ్లి చేసుకున్నాడంటూ గులాబీ అనుకూల నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి రకరకాల మీమ్స్ సృష్టించి రాధాకృష్ణను విమర్శిస్తున్నారు.
మనవడి దగ్గర ఫోన్ ఎలా వాడాలో నేర్చుకున్న కేసీఆర్ అంటూ ఓ బుల్లి కథ రాసిన రాధాకృష్ణ … ఆ ఫోన్ వాడటం రాకే అల్లుడుకి అడ్డంగా దొరికాడట
యువ డాక్టర్తో రాసలీలలు బయటపడ్డాయట pic.twitter.com/7PkGzPx7T9
— Nippu Kodi (@NippuKodi) January 28, 2025
రాధాకృష్ణ వర్సెస్ భారత రాష్ట్ర సమితి ఇవాళ కొత్త కాకపోయినా.. ప్రస్తుతం తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో రాధాకృష్ణకు అనుకూల ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. అలాంటప్పుడు రాధాకృష్ణ సోషల్ మీడియాలో తప్పితే.. భారత రాష్ట్ర సమితి పెద్దగా చేసేదేమీ ఉండదు.. గతంలో ఇదే తీరుగా రాధాకృష్ణ తన పత్రికలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరి పట్ల వార్తలు రాశారు. అప్పట్లో ఆయన ఛానల్ పై అప్రకటిత నిషేధాన్ని కెసిఆర్ విధించారు. ఆ తర్వాత ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఎక్కడ చెడిందో గాని ఇద్దరి మధ్య మళ్లీ జగడం మొదలైంది. చివరికి అది ఉప్పు నిప్పులాగానే కొనసాగుతోంది. చూడాలి మరి కెసిఆర్ కు హిమాన్షు రావు ఫోన్ వాడకం గురించి నేర్పించే వ్యవహారంలో రాధాకృష్ణ ఎలా స్పందిస్తాడో?! అన్నట్టు గతంలో ఇలా గొడవలు జరిగినా.. కెసిఆర్, రాధాకృష్ణ కలిసిపోయారు. ఎంతైనా బావ బామ్మర్దులు కాబట్టి.. ఆ మాత్రం చనువు ఇద్దరి మధ్య ఉంటుంది. ఇంకోటి దానికి రాధాకృష్ణ మీద భారత రాష్ట్రసమితి నాయకులు యుద్ధం చేస్తే.. చివర్లో బుగ్గ గాళ్లు అయ్యేది కూడా గులాబీ నాయకులే.. అందులో ఎటువంటి అనుమానం లేదు.