HomeతెలంగాణTelangana Elections 2023: పోలింగ్ ముగిసిన మరుక్షణం ఎగ్జిట్ పోల్స్

Telangana Elections 2023: పోలింగ్ ముగిసిన మరుక్షణం ఎగ్జిట్ పోల్స్

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు క్యూ లైన్ లో బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే క్యూ లైన్ లో ఉన్న చివరి ఓటరు వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. పోలింగ్ ముగియగానే తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. తెలంగాణకు ఆఖరి విడతగా ఈరోజు పోలింగ్ జరుగుతోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. అందుకే అధికార బిజెపితో పాటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నవంబర్ 7 నుంచి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చివరిగా తెలంగాణకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ పోలింగ్ ముగిసిన మరుక్షణం ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే జాతీయ మీడియా సంస్థలు సర్వే చేపట్టాయి. వాటి ఫలితాలను వెల్లడించనున్నాయి. దీంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ ఎన్నికల ఫలితాలను అనుసరించి దేశ రాజకీయాల్లో మార్పులు రానున్నాయి. బిజెపి గెలిస్తే మరోసారి ఆ పార్టీకి తిరుగులేదు. కాంగ్రెస్ గెలిస్తే మాత్రం రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదన్నది బిజెపి భావన. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చినా పరవాలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాకూడదని బిజెపి గట్టిగానే ప్రయత్నాలు చేసింది.ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బిజెపి పట్టు సడలే అవకాశం ఉంది. అందుకే ప్రచారం పర్వంలో బిజెపి కొత్త ఎత్తుగడలను వేసింది. ప్రధాని మోదీ నుంచి బిజెపి సీనియర్ నాయకులు వరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు క్యూ కట్టారు.

డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే ఇంతలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొంతవరకు ప్రభావితం చేయనున్నాయి. గతంలో చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఫలించాయి. మరి కొన్నిసార్లు మాత్రం ఫెయిల్ అయ్యాయి. అయితే ఎక్కువగా ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ దగ్గరగా ఉంటాయి. ఈ తరుణంలో ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత జాతీయ మీడియా సంస్థలు ఓటరు పల్స్ ఇది అంటూ ప్రకటించే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ తో గెలుపోటములపై రాజకీయ పార్టీలు ఒక అంచనాలకు రానున్నాయి. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రూపొందించుకోనున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version