Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి రెండు రోజులైంది. గురువారం సాయంత్రమే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియాల్సి ఉండగా.. చాలా నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌ల దగ్గర ఓటర్లు సాయంత్రం 5 తర్వాత కూడా క్యూలో ఉన్నారు. కొన్ని కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. దీంతో ఇండియా టుడే సంస్థ మాత్రం పోలింగ్ పూర్తయ్యే వరకూ పోలింగ్ సరళిని అంచనా వేసింది. దీంతో గురువారం కాకుండా శుక్రవారం రాత్రి తెలంగాణ ఎగ్జిట్ పోల్‌స విడుదల చేసింది. ఇందులో అధికారం ఎవరిదో తేల్చేసింది. గురువారం సాయంత్రం సర్వేలపై అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్.. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ తర్వాత సైలెంట్ అయ్యారు. ఆజ్‌తక్ కూడా శుక్రవారమే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది.
ఇండియా టుడే ఇలా..
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయాన్ని వెల్లడించాయి. ఇండియా టుడే సర్వేలో కూడా అధికార బీఆర్‌ఎస్‌కు షాక్ తప్పవనే వెల్లడించాయి. ఈ సర్వేలో బీఆర్‌ఎస్‌కు 34–44 సీట్లు వస్తాయని తమ సర్వేలో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 63– 73 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 4 –8 సీట్లు.. ఇతరులు (ఎంఐఎం) 5–8 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది.
పోలింగ్ శాతం ఇలా..
ఇక ఈ ఎన్నికల్లో పార్టీల వారీగా పోలింగ్ శాతం కూడా ఏ పార్టీకి ఎంత ఉంటుందని కూడా తేల్చింది. ప్రస్తుతం అధికార బీఆర్‌ఎస్‌కు గత ఎన్నికల్లో 45. 5 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి మాత్రం ఈ పార్టీకిఇ 35 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక కాంగ్రెస్ ఓట్ల శాతం భారీగా పెరుగుతుందని అంచా వేసింది. 42 శాతం వరకు ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్లు తేల్చింది. ఇక బీజేపీకి 10 శాతం, ఎంఐఎంకు 3 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు వస్తాయని ఇండియా టుడే ప్రకటించింది.
బీజేపీతోనే బీఆర్‌ఎస్‌కు దెబ్బ..
2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు భారీగా ఓట్లు పోల్ కావడానికి టీడీపీపై కోపం కూడా ఒక కారణం. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేశాయి. దీంతో బీజేపీ ఓటు బ్యాంకు కూడా బీఆర్‌ఎస్‌కే పోలైంది. కానీ, ఈసారి బీజేపీ తన నోటు బ్యాంకును కాపాడుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 6 శాతం ఓట్లు రాగా, ఈసారి 10 నుంచి 15 శాతం వరకు రావచ్చని అంచనా. బీజేపీ కారణంగానే బీఆర్‌ఎస్ ఓటింగ్ శాతం భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది.