KCR: తెలంగాణలో 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ పోలింగ్ ముగిసిన తర్వాతనే ప్రెస్‌మీట్ పెట్టారు. కానీ, మూడోసారి అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డిన కేసీఆర్.. ఈసారి మాత్రం పోలింగ్ అనంతరం ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ ప్రెస్‌మీట్ పెట్టారు. ఎగ్జిట్ పోల్స్ బుల్‌షిట్ అని ఖండించారు. ఎన్నికల సంఘం తీరును తప్పు పట్టారు. పోలింగ్ పూర్తికాకుండానే ఎగ్జిట్ పోల్స్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారని మందలించారు.
రిజల్ట్ తర్వాతే కేసీఆర్ బయటకు..
ప్రగతి భవన్‌లోనే ఉన్న కేసీఆర్.. డిసెంబర్ 4న కేబినెట్ భేటీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈమేరకు సీఎంవో నుంచి ఒక ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. మరోవైపు పోలింగ్ సరళిపై కీలక నేతలతో సమావేశం కూడా నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకున్నారు. ఎక్కడ మైనస్ అయింది.. ఎక్కడ ప్లస్ అయింది.. అని సమీక్ష చేశారని సమాచారం. చివరకు సమావేశానికి వచ్చిన నేతలు కూడా నారాజ్‌గా కనిపించడంతో మనమే అధికారంలోకి వస్తున్నాం.. 3వ తేదీన సంబురాలు చేసుకుందాం అని ప్రకటించారు. దీంతో నేతల్లో కాస్త హుషారు కనిపించిందని తెలుస్తోంది. అంతర్గత మీటింగ్‌లతో ఉన్న కేసీఆర్ రిజల్ట్ తర్వాతనే బయటకు వస్తారని తెలుస్తోంది.
అనుకూలంగా వస్తే..
అన్ని ఎగ్జిట్ పోల్స్.. బీఆర్‌ఎస్ ఓడిపోతుందని తెలిపాయి. కాంగ్రెస్‌దే అధికారం అని తేల్చాయి. అయితే కేసీఆర్, కేటీఆర్ అంచనా వేస్తున్నట్లు 50 సీట్లు బీఆర్‌ఎస్ గెలుచుకుంటే మాత్రం.. రిజల్ట్ తర్వాత కేసీఆర్ బయటకు రావచ్చని గులాబీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. చాలా అగ్రెసివ్‌గా మాట్లాడుతారని తెలుస్తోంది. ఈమేరకు ప్రసంగం కూడా సిద్ధం చేసుకుంటున్నారట. ఇక వ్యతిరేక ఫలితాలు వచ్చి ఎగ్జిట్ పోల్‌స నిజమైతే మాత్రం మీడియాకు దూరంగానే ఉంటారని, ప్రగతి భవన్ నుంచి ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోతారని అంటున్నారు. ఓటమిపై కేటీఆరే మాట్లాడతారని తెలుస్తోంది.