EX Minister Mallareddy: 2023లో జరిగిన ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం లో మల్లారెడ్డి ఎమ్మెల్యేగా విజయ సాధించారు. ఇప్పుడే కాదు.. ఆయన చాలా కాలం నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తూ వరుస విజయాలు సాధించుకుంటూ వస్తున్నారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డి పని చేశారు. ఆ మధ్య ఆయన విద్యాలయాలపై ఐటి శాఖ దాడులు చేసినప్పుడు.. పాలు అమ్మిన.. పూలు అమ్మిన. కష్టపడిన. విద్యాసంస్థలు నెలకొల్పిన.. లక్షలదిమంది విద్యార్థులకు చదువు చెప్పిస్తున్న.. అని మల్లారెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. దీంతో ఒక్కసారిగా మల్లారెడ్డి సోషల్ మీడియా స్టార్ట్ అయిపోయారు.. ఇక అప్పటినుంచి ఆయన ఏం మాట్లాడినా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయిన తర్వాత మల్లారెడ్డి ఒకప్పటిలాగా దూకుడుగా లేరు. శాసనసభలో.. తనకు అవకాశం వచ్చినప్పుడు నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడుతున్నారు. నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లారెడ్డి విద్యా సంస్థలు అక్రమంగా నిర్మించిన రోడ్లను.. ఇతర నిర్మాణాలను పడగొట్టించిన విషయం తెలిసిందే.
Also Read : పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు.. కవితకు జనసేన ‘జోకర్’ కౌంటర్..
జపాన్ పర్యటనలో..
మల్లారెడ్డి ప్రస్తుతం జపాన్లో పర్యటిస్తున్నారు. ఆయన సతీమణితో కలిసి జపాన్ లోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆయన సామాజిక మాధ్యమాలలో పంచుకుంటున్నారు.. దాదాపు కొన్ని రోజుల నుంచి మల్లారెడ్డి జపాన్ లో పర్యటిస్తున్నారు. తన సతీమణితో కలిసి జపాన్లోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఇటీవల బుల్లెట్ ట్రైన్ లో పర్యటించిన మల్లారెడ్డి.. తన అనుభవాలను పంచుకున్నారు. సాధారణంగా హైదరాబాదులో ఉంటే వైట్ అండ్ వైట్ డ్రెస్ మల్లారెడ్డి కనిపిస్తారు.. ఇటీవల తన మనవరాలి వివాహ వేడుకలు మాత్రం వెస్ట్రన్ కాస్ట్యూమ్ వేసుకున్నారు. ఆ వేడుకలో స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఇక ఇటీవల హోలీ వేడుకల్లోనూ డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఇక జపాన్ లోపర్యటిస్తున్న మల్లారెడ్డి, ఆయన భార్య.. ఒక్కసారిగా జపనీయులు అయిపోయారు. జపాన్ దేశస్తులు వేసుకునే దుస్తులను ధరించి.. జపనీయులలాగా దర్శనమిచ్చారు.. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ” మల్లారెడ్డి ఎక్కడికి వెళ్లినా తనదైన ప్రత్యేకతను చాటుకుంటారు. ఇప్పుడు జపాన్ లోను అదే తీరు కొనసాగిస్తున్నారు. జపాన్ దేశస్తులు వేసుకునే కాస్టమ్స్ ధరించి ఆకట్టుకుంటున్నారు. మల్లారెడ్డి స్టైలే వేరు.. ప్రచారం ఎలా చేసుకోవాలో… ప్రచారంలో ఎలా ఉండాలో ఈయనను చూస్తే తెలుస్తుందని” నెటిజన్లు అంటున్నారు. ఇక జపాన్ లో పర్యటిస్తున్న మల్లారెడ్డి.. అక్కడి రుచులను కూడా ఆస్వాదిస్తున్నారు. తన సతీమణితో కలిసి అక్కడ సూప్ లు తాగుతూ.. అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read : ఎండ నుంచి ట్రాఫిక్ పోలీసులకు రక్షణ.. పంపకానికి ఏసీ హెల్మెట్లు సిద్ధం!