HomeతెలంగాణKTR: రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా.. దీపావళి రోజు బాంబు పేల్చిన కేటీఆర్‌..!

KTR: రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా.. దీపావళి రోజు బాంబు పేల్చిన కేటీఆర్‌..!

KTR: దేశమంతా దీపావళి వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టపాసుల శబ్దాలు మార్మోగుతున్నాయి. దీపాల వెలుగుల్లో అందరి ముంగిల్లు కాంతులీనుతున్నాయి. ఈ తరుణంలో రాజకీయా నాయకులు కూడా అందరికీపండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. దీపావళి రోజు నెటిజన్లతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాంగ్రెస్‌ హామీలు నెరవేర్చే వరకూ వెంటాడతామని స్పష్టం చేశారు. తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. ఓ దశలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని బాంబు పేల్చారు. కానీ ప్రజల కోసమే నిలబడి పోరాడుతున్నానని చెప్పారు.

ట్విట్టర్‌ వేదికగా చిట్‌చాట్‌..
ట్విట్టర్‌లో కేటీఆర్‌ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. ఆయనకు లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. దీపావళి రోజు సెలవు క ఆవడంతో ఈ రోజు కూడా రాజకీయాలు ఎందుకనుకున్నారో ఏమో కాసెపే తన ఫాలోవర్లతో చర్చించాలనుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఆస్క్‌ కేటీఆర్‌ పేరుతో నెటిజన్లతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగా లేవని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. 2025 తర్వాత ఆయన విస్తృతంగా ప్రజల్లోకి వస్తారని వెల్లడించారు.

420 హామీల కోసం సమయం..
కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చిందని, వాటిని నెరవేర్చాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేసీఆర్‌ సమయం ఇస్తున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో ఓటమికి పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతే కారణమని తెలిపారు. కాంగ్రెస్‌ అభద్ధపు హామీలు దీనికి తోడయ్యాయని తెలిపారు. పది నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదని అన్నారు. హామీలు నెరవేర్చే వరకూ ఆ పార్టీని, ప్రభుత్వాని వెంటాడతామని స్పష్టం చేశారు.

కుటుంబ సభ్యులను లాగుతున్నారు..
ఇక ప్రస్తుత రాజకీయలు బాగా లేవన్న కేటీఆర్‌.. ఇప్పుడు నేతల కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని తెలిపారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయలేదని తెలిపారు. ఇక మూసీ పునరుజ్జీవం దేశంలోనే అతిపెద్ద స్కాంగా అభివర్ణించారు. హైడ్రా అనేది ఒక బ్లాక్‌మెయిలింగ్‌ టూల్‌ అని విమర్శించారు. హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లు కూలుస్తున్నారని మండిపడ్డారు. పెద్దవాళ్ల జోలికి మాత్రం వెల్లడం లేదని తెలిపారు.

పార్టీ బలోపేతంపై దృష్టి..
ఇక తెలంగాణలో ఎన్నికల తర్వాత పార్టీలో కాస్త స్తబ్ధత నెలకొందని, దానిని తొలగించేలా చూస్తామన్నారు. పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. త్వరలో మహిళా, విద్యార్థి కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. విలువలు లేని రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular