Eenadu legal notice: ఇటీవల ఈనాడు పత్రికలో ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఈనాడులో ప్రసారమయ్యే కథనాలను ఇతర అంశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు.. సోషల్ మీడియా గ్రూపులలో పోస్ట్ చేయవద్దు. యాజమాన్యం అనుమతి లేకుండా కంటెంట్ వాడుకోవద్దు.. కథనాలకు సంబంధించిన క్లిప్పింగులను కూడా ఎట్టి పరిస్థితుల్లో బహిరంగపరచద్దు.
ఇటీవల ఈనాడు పత్రికలో ఈనాడు యాజమాన్యంలో పనిచేస్తున్న లీగల్ అడ్వైజర్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన పట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ సమాజంలో అయితే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రజల అనుమతి లేకుండా వారి సంబంధించిన విషయాలను పత్రికలో ప్రచురిస్తూ.. ఆ పత్రికను సరైనదరక విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్న ఈనాడు యాజమాన్యం.. అలాంటి ప్రకటన ఎలా చేస్తుందని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. తెలంగాణ మీడియా ఫోరం ఆధ్వర్యంలో ఒక లేఖ కూడా విడుదలైంది. ఆలేఖలో అనేక విషయాలను తెలంగాణ మీడియా ఫోరం బాధ్యులు ప్రస్తావించారు. ఈనాడు యాజమాన్యం వైఖరి సరైనది కాదని మండిపడ్డారు. ప్రజలకు సంబంధించిన వ్యవహారాలను వారి అనుమతి లేకుండానే వార్తలుగా ప్రచురిస్తూ.. ఈనాడు ఆధ్వర్యంలో వెలువడుతున్న మాధ్యమాలలో ప్రసారం చేస్తూ వ్యాపారం చేస్తూ.. ఇప్పుడు ప్రజలను ఆ క్లిప్పింగులను.. ఇతర మాధ్యమాలలో పోస్ట్ చేయకూడదు.. వాడకూడదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని తెలంగాణ మీడియా ఫోరం ప్రశ్నిస్తోంది.
ఒకవేళ ఈనాడు యాజమాన్యం ఇదే ధోరణి కొనసాగిస్తే తెలంగాణ సమాజం పోరాటం సాగిస్తుందని.. శాంతికపోతాలై ఎగిరి ఈనాడు యాజమాన్యం కోటలను బద్దలు కొడుతుందని హెచ్చరించింది. వాస్తవానికి నెట్ సోషల్ మీడియా కాలంలో పత్రికల యాజమాన్యాలు వార్తలను పోస్ట్ చేస్తున్నాయి. కథనాలను త్వరగా రీచ్ అవ్వడానికి అందుబాటులో ఉంచుతున్నాయి. దీనికి తోడు పాఠకుడు కొనుగోలు చేసే విధంగా పత్రికలను విక్రయిస్తున్నాయి. అలాంటప్పుడు వినియోగదారుల హక్కులను కాలరాసే విధంగా ఈనాడు యాజమాన్యం వ్యవహరించడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వ్యవహార శైలి సరైనది కాదని మండిపడుతున్నారు.. ఈనాడు విక్రయిస్తున్న పేపర్ కొనుగోలు చేయడం ద్వారా అందులో ఉన్న ప్రతి కథనం మీద వినియోగదారులకు హక్కు ఉంటుందని.. అందులో ఉన్న కంటెంట్ వివిధ మాధ్యమాలలో పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని.. అలాంటప్పుడు ఇన్ని షరతులు ఎలా విధిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈనాడు యాజమాన్యం విడుదల చేసిన లీగల్ నోటీస్ వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజం మరో విధంగా పోరాడుతుందని హెచ్చరిస్తున్నారు.. మరి దీనిపై ఈనాడు యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.
