Earthquake In Hyderabad: తెలంగాణకు భూకంప భయం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి. సముద్రమట్టానికి ఎత్తులో దూరంగా ఉండడంతో భూకంప ముప్పు ఉండదని అంచనా వేస్తున్నారు. కానీ, అప్పుడుప్పుడు భూమిలోపలి ప్రకంపనలు పైవరకు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి కంపిచింది. తాజాగా హైదరాబాద్లో భూకంపం బచ్చింది. గాజులరామారం మెట్ఖాన్గూడ ప్రాంతంలో ఉదయం 10:10 గంటలకు భూమి కంపించినట్లు శబ్దం వినిపించింది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నుంచి స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు.
పేలుడా, భూకంపమా..
భూకంపం కారణంగా భూమి కంపించిందా లేక పేలుడు పదార్థాల వల్లా శబ్దం వచ్చిందా అనే చర్చ స్థానికుల్లో మొదలైంది. హైదరాబాద్ సీస్మిక్ జోన్–2లో ఉండటం స్వల్ప కంపనాలకు అనుకూలం. నిర్మాణాలు, భూగర్భ గాలి పేలుళ్లు కూడా ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది.
స్థానికుల ఆందోళన..
అయితే భూ ప్రకంపనలతో ప్రాంతంలో నివాసులు భయంతో ఇళ్లు వదిలి బయటికి వచ్చారు. భవిష్యత్ ప్రమాదాలపై ఆందోళన పెరిగింది. అధికారులు దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ ప్రకంపనలపై ప్రభుత్వం, అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో మళ్లీ కంపిస్తుందేమో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రకంపనలకు కారణాలు తెలపాలని కోరుతున్నారు.
హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలు
గాజులరామారంలోని మెట్ఖాన్గూడా ప్రాంతంలో ఉదయం 10:10 గంటలకు భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని తెలిపిన స్థానికులు
దీంతో పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నుండి భయంతో బయటికి పరుగులు తీసిన స్థానికులు
ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేక ఇతర… pic.twitter.com/tHONI6xbl6
— Telugu Scribe (@TeluguScribe) February 10, 2026