https://oktelugu.com/

TS DSC: త్వరలో మరో డీఎస్సీ.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన భట్టి.. ఎన్ని పోస్టులంటే..!

డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ అభ్యర్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌ న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత డీఎస్సీ పూర్తయిన తర్వాత మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 16, 2024 / 10:18 AM IST

    TS DSC

    Follow us on

    TS DSC: తెలంగాణలో మరో రెండు రోజుల్లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. 11,062 ఖాళీల భర్తీకి రేవంత్‌రెడ్డి సర్కార్‌ తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇచ్చి.. తర్వాత టెట్‌ నిర్వహించడంతో డీఎస్సీ నిర్వహణ ఆలస్యమైంది. వాస్తవానికి గత ప్రభుత్వం 5 వేల పోస్టులతో డీఎస్సీ గతేడాది ఆగస్టులో విడుదల చేసింది. నవంబర్‌లో పరీక్షలు జరగాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో పాత డీఎస్సీకి కొనసాగింపుగా పోస్టులు పెంచి నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూన్‌లో టెన్‌ నిర్వహించిన ప్రభుత్వం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈమేరకు హాల్‌ టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టింది. Another

    వాయిదా వేయాలని ఆందోళన..
    ఇదిలా ఉంటే.. డీఎస్సీ వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. టెట్‌ తర్వాత కనీసం 45 రోజుల సమయం ఇవ్వాలని, కానీ ప్రభుత్వం టెట్‌ ఫలితాలు వచ్చి నెల రోజులు కూడా కాకుండానే పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరస్థితిలో వాయిదా వేయమని స్పష్టం చేసింది. ఇప్పటికే పరీక్షల నిర్వహణ ఆలస్యమైందని స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేస్తే పేద విద్యార్థులు నష్టపోతారని పేర్కొంది. మెజారిటీ అభ్యర్థులు గత ఆగస్టు నుంచి ప్రపేర్‌ అవుతున్నారని, కోచింగ్‌ తీసుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

    గుడ్‌ న్యూస్‌ చెప్పిన డిప్యూటీ సీఎం..
    డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ అభ్యర్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌ న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత డీఎస్సీ పూర్తయిన తర్వాత మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరుగనున్న ప్రస్తుత డీఎస్పీ బాగా రాయాలని సూచించారు.

    రెండు రోజుల్లో పరీక్షలు..
    ఇదిలా ఉంటే.. డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుంచి(మరో రెండు రోజుల్లో) ప్రారంభం కానున్నాయి. అభ్యర్థుల సమస్యలు పరిష్కరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 2.05 లక్షల మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు తెలిపారు.

    5 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ..
    ఇదిలా ఉంటే.. ప్రస్తుత డీఎస్సీ పూర్తయిన తర్వాత కొత్తగా 5 వేల పోస్టులతో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 1,25,058 పోస్టులు ఉండగా, 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన 5 వేలతోపాటు భవిష్యత్‌లో ఏర్పడే మరికొన్ని ఖాళీలను కూడా కలుపుతామని డిప్యూటీ సీఎం తెలిపారు. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఖాళీలను బట్టి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

    కాలయాపన చేసిన గత ప్రభుత్వం..
    ఇక గత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్లలో గ్రూప్‌ 1, 2, 3 పోస్టులతోపాటు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదని పేర్కొన్నారు. అప్పట్లో సీఎల్పీ నేతగా తాను నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో డిమాండ్‌ చేశానని తెలిపారు. చివరికి నోటిఫికేషన్లు ఇచ్చి.. పరీక్షలు నిర్వహిస్తే, పేపర్‌ లీకులయ్యాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. గత సర్కార్‌ గ్రూప్‌–2 పరీక్షను 3 సార్లు వాయిదా వేస్తే.. తాము వచ్చే నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గ్రూప్‌ 3 పరీక్షలు నవంబర్‌లో జరుగుతాయన్నారు. తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలనేదే తమ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.