https://oktelugu.com/

DSC 2024 Results: టీచర్‌ ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. కాసేపట్లో పరీక్ష ఫలితాలు.. ఎక్కడ చూడొచ్చంటే?

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్‌ డీఎస్సీ. 11 వేల పైచిలుకు పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి. పరీక్షలు నిర్వహించింది. సోమవారం(సెప్టెంబర్‌ 30న) ఫలితాలు వెల్లడించనుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 30, 2024 / 11:15 AM IST

    DSC 2024 Results

    Follow us on

    DSC 2024 Results: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని టీపీసీసీ హోదాలో రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించారు. ఈమేరకు ఎన్నికల్లో విజయం సాధించారు. కొత్త ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 7న కొలువుదీరింది. దీంతో ఫిబ్రవరిలో 11,062 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తర్వాత టెట్‌ కూడా నిర్వహించాలని ఒత్తిడి రావడంతో మార్చిలో టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి మేలో పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు కూడా నిర్వహించింది. ఆన్‌లైన్‌ పద్దతిలో పరీక్షలు నిర్వహించింది. తర్వాత ప్రాథమిక కీ విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత సెప్టెంబర్‌ రెండో వారంలో తుది కీ విడుదల చేసింది.

    కాసేపట్ల రిజల్ట్స్‌..
    ఇదిలా ఉంటే.. పరీక్ష రాసిన సుమారు 3 లక్షలకుపైగా ఉద్యోగార్థులు డీఎస్సీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఫలితాల ప్రకటనకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాసేపట్లో ఫలితాలు ప్రకటించనున్నారు. 11,062 పోస్టులకు 2.45 లక్షల మంది పరీక్ష రాశారు. సర్కారు కొలువు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో కొన్ని నిమిషాల్లో తేలనుంది.

    జిల్లాల వారీగా భర్తీ..
    ప్రస్తుతం డీఎస్పీ పోస్టులను కొత్త జిల్లాల వారీగా భర్తీ చేయనున్నారు. 33 జిల్లాల్లో పోస్టులు భర్తీ చేస్తారు. కలెక్టర్‌ డిస్టిక్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కాగా, ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారని తెలుస్తోంది. కాగా, డీఎస్సీ నోటిఫికేషన్‌ ఈ ఏడాది మార్చి 1న విడుదలైంది. గత ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చారు. గత ప్రభుత్వం 5 వేల పోస్టులు ప్రకటించగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆ పోస్టులను 11,062కు పెంచింది. లక్షలాది మంది ఎదురు చూస్తున్న డీఎస్పీ ఫలితాలతో కాస్త ఊరట లభించనుంది. పరీక్షలకు హాజరైన 2.45 లక్షల మందిలో 11,062 మంది ఉపాధ్యాయులుగా మారనున్నారు.