US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అమెరికన్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బరిలో నిలిచేది ఎవరో తేలిపోయింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మొదట ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రేసులో నిలిచారు. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖాయమైంది. దీంతో ఇద్దరూ ప్రచారం మొదలు పెట్టారు. ముఖాముఖి డిబేట్లు కూడా నిర్వహించారు. తొలి డిబేట్‌లోనే బైడెన్ తేలిపోయాడు. దీంతో బైడెన్‌ను తప్పించాలన్న డిమాండ్ పెరిగింది. పోటీలో ఉన్న ఇద్దరి పాలనను చూసిన అమెరికన్లు.. వయోభారంతో బైడెన్‌ను,.. గత పాలన తీరుతో ట్రంప్‌పై విముఖత చూపారు. డెమొక్రటిక్ పాలన మెరుగ్గా ఉన్నా.. బైడెన్ తీరుతో అతడిని మార్చాలని కోరారు. ఈ క్రమంలో ఆ పార్టీకి ఆర్థికసాయం చేసే ఫైనాన్షియర్లు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా బైడెన్ తప్పుకోవడమే మేలని సూచించారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలో ప్రచారా ర్యాలీలో పాల్గొన్న బైడెన్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన తర్వాత ట్రంప్‌కు మద్దతు పెరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బైడెన్ కరోనా బారిన పడ్డారు. దీంతో అతను హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తన వారసురాలిగా కమలా హ్యారిస్‌కు మద్దతు తెలిపారు.
కమలకు పెరిగిన మద్దతు..
డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ తప్పుకున్న తర్వాత అద్యక్ష అభ్యర్థి ఎవరవుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అయితే బైడెన్ మద్దతు ఇచ్చిన కమలా హ్యారిస్‌కే మాజీ అధ్యక్షుడు క్లింటన్, ఒబామా మద్దతు తెలిపారు. తర్వాత పార్టీలోని డెలిగేట్స్ చాలా మంది కమలకు మద్దతు తెలిపారు. దీంతో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఈ క్రమంలో కమలా కూడా ఇటీవల తాను అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రనకటించారు. ఈమేరకు పార్టీ పత్రాలపై సంతకాలు చేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్రంప్.. కమలా హ్యారిస్‌పై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. కమలాను ఓడిస్తానంటు సవాల్ చేస్తున్నారు.
డిబేట్‌కు సై..
అధికార డెమొ‘క్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఖరారు కావడంతో ఆమెతో ముఖాముఖి చర్చకు రిపబిక్లకన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సై అన్నాడు. ఈమేరు ఫాక్స్ న్యూస్ ఆఫర్‌ను ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూప్ సోషల్ మీడియాలో తాజాగా పోస్టు చేశారు. వచ్చే నెలలో వీరి మద్య డిబేట్ జరగనుంది. సెప్టెంబర్ 4న ఫాక్స్ న్యూస్ నిర్వహించే ఈవెంట్‌లో కమలా హ్యారిస్‌తో డిబేట్ జరిపేందుకు ట్రంప్ అంగీకరించారు. ఇదే తేదీన జోబైడెన్, ట్రంప్ మధ్య డిబేట్‌కు ఏబీసీ ఛానల్ ప్రాన్ చేసింది. ఇందుకు ఇద్దరూ అంగీకరించారు. కానీ, బైడెన్ తప్పుకోవడంతో డిబేట్ రద్దయింది. ఇక ఫాక్స్ న్యూస్ డిబేట్ పెన్సిల్వేనియాలో నిర్వహించనుంది. బైడెన్‌తో జరిగిన చర్చలోని రూల్స్ అన్నీ దీనికి వర్తిస్తాయి. పర్తిస్థాయిలో ప్రేక్షకులు కూడా ఉంటారు అని ట్రంప్ వెల్లడించారు.