Uppal Balu : సోషల్ మీడియా యుగంలో టాలెంట్, ప్రత్యేకత ఉన్న ప్రతి ఒక్కరూ సెలబ్రిటీ కావచ్చు. అతి సామాన్యులను స్టార్స్ ని చేసిన ఘనత సోషల్ మీడియాకి ఉంది. ఒకప్పుడు టాలెంట్ నిరూపించుకోవాలి అంటే ఒక వేదిక కావాల్సి వచ్చేది. ఎవరో ఒకరు ప్రోత్సహించాల్సిన అవసరం ఉండేది. నేరుగా ప్రతిభను చాటుకునే వెసులుబాటు సోషల్ మీడియాతో కలిగింది. దేశవ్యాప్తంగా లక్షల మంది సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అయ్యారు. ముఖ్యంగా టిక్ టాక్ యాప్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వారిలో ఉప్పల్ బాలు ఒకరు.

టిక్ టాక్ లో డాన్స్ వీడియోలు చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్నాడు ఉప్పల్ బాలు. అతనో గొప్ప డాన్సర్ కాకపోయినా ప్రత్యేకత చాటుకున్నారు. టిక్ టాక్ లో లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఆ యాప్ ఇండియాలో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఉప్పల్ బాలు జనాల్లోకి వెళ్ళిపోయాడు. దీంతో మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో అతడు వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. జబర్దస్త్ తో పాటు పలు బుల్లితెర ఈవెంట్స్ లో ఉప్పల్ బాలు పాల్గొన్నారు.
తనకున్న పాపులారిటీ నేపథ్యంలో ఈవెంట్స్ లో పాల్గొంటూ ఉంటాడు. సోషల్ మీడియా స్టార్ గా ఉప్పల్ బాలు ఎంత సంపాదిస్తున్నాడనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ ప్రశ్నకు ఆయనే స్వయంగా సమాధానం చెప్పాడు. ఉప్పల్ బాలుతో అభిమానులు బర్త్ డే విషెస్ చెప్పించుకుంటారు. పిల్లలు, కుటుంబ సభ్యుల పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాల్సిందిగా అడుగుతారు. అలా బర్త్ డే విషెస్ చెప్పి ఉప్పల్ బాలు రూ. 200 నుండి 500 వందలు తీసుకుంటాడట. బర్త్ డే విషెష్ చెప్పడం ద్వారా ఉప్పల్ బాలు రోజుకు రూ. 500 వందలకు పైగా సంపాదిస్తాడట. బర్త్ డే విషెస్ చెప్పి పదివేలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయట.
ఇక సీమంతం, పెళ్లిళ్లు వంటి వేడుకలకు ఆహ్వానిస్తారట. పెళ్లి కూతురిని ఆశీర్వదించమని కోరుతారట. అలా కొంత అమౌంట్ వస్తుందట. ఈవెంట్స్ కి వెళితే ఐదు వేలు, పదివేలు ఇస్తారట. వెయ్యి, రెండు వేలుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయని ఉప్పల్ బాలు చెప్పారు. ఖర్చులు భరించి ఎంత ఇచ్చినా ఈవెంట్ కి వెళతాను అని ఉప్పల్ బాలు చెప్పారు. అత్యధికంగా ఈవెంట్ కి ఇరవై వేలు తీసుకున్నట్లు ఉప్పల్ బాలు వెల్లడించారు . నెలకు కనీసం రూ. 30 వేలు సంపాదిస్తాను అన్న ఉప్పల్ బాలు, అందులో ఇంటి రెంట్, తిండి ఖర్చులు, అమ్మకు మందుల ఖర్చు పోను… ఐదు నుండి పది వేలు సేవ్ చేస్తాను అన్నాడు.