Biryani: తొమ్మిదో ఏడాది కూడా ఆన్ లైన్ ఆర్డర్లలో కూడా బిర్యానీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది.. స్విగ్గి చెప్పిన లెక్కల ప్రకారం 2024 జనవరి 1 నుంచి నవంబర్ 22వ తేదీ వరకు 8.3 కోట్ల బిర్యానీలను హైదరాబాద్ ప్రజలు ఆర్డర్ చేశారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రతి నిమిషానికి 158 బిర్యానీలను కొనుగోలు చేశారు. సెకను కు రెండు బిర్యానీల చొప్పున ఆర్డర్ చేశారు. బిర్యానీ తర్వాత 2.3 కోట్ల ఆర్డర్లతో దోస నిలిచింది.. ఈ ఏడాది 4.9 లక్షల చికెన్ బిర్యానీలు ఆర్డర్లు అదనంగా వచ్చాయని స్విగ్గి ప్రకటించింది. హైదరాబాద్ ప్రజలు 97 లక్షలకు పైగా చికెన్ బిర్యాని లను ఆర్డర్ చేశారట. బెంగళూరు ప్రజలు 77 లక్షల బిర్యానీలను ఆర్డర్ చేసి రెండవ స్థానంలో నిలిచారు. చెన్నై ప్రజలు 46 లక్షల బిర్యానీలను హార్నర్ చేసి మూడో స్థానంలో నిలిచారు. స్విగ్గి లెక్కల ప్రకారం మెట్రో నగరాలలో ఉంటున్న ప్రజలు. చికెన్ బర్గర్ ఎక్కువగా తింటున్నారు. రాత్రి 12 నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు చికెన్ బర్గర్ ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. 18.4 లక్షల చికెన్ బర్గర్లను మెట్రో నగరాల ప్రజలు ఆర్డర్ చేశారని స్విగ్గి తన వార్షిక నివేదికలో పేర్కొంది.
మసాలా దోశ ఫేమస్
ఇక దోశ విషయంలో మసాలా దోశ సరికొత్త రికార్డులను సృష్టించింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరవాసులు జనవరి 1 నుంచి నవంబర్ 22 వరకు 25 లక్షల మసాలా దోశలను ఆర్డర్ చేశారు. ఢిల్లీ, చండీగఢ్, కోల్ కతా ప్రాంతాల ప్రజలు చోలే, ఆలు పరాటా, కచోరీలను ఎక్కువగా ఆర్డర్ చేశారు.. బెంగళూరు నగరంలోని ఓ వ్యక్తి ఏడాది మొత్తం పాస్తా కోసం దాదాపు 50 వేల వరకు ఖర్చు చేశాడు.. ఇతడు స్విగ్గి యూజర్ గా ఉన్నాడు. పెటుక్సిన్ ఆల్ ఫ్రెడో -55, చీజ్ మాక్ -40, స్ప ఘెట్టి 30 లను ఆర్డర్ చేశాడు. ఇక ఏడాది భోజనం కంటే రాత్రిపూట డిన్నర్ కోసమే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఆర్డర్లు 29% పెరిగాయి. డిన్నర్లకు సంబంధించి మొత్తం 21.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి ప్రకటించింది. అత్యంత ఎక్కువమంది ఇష్టపడిన స్నాక్ ఐటమ్ గా చికెన్ రోల్ నిలిచింది. 24.8 లక్షలమంది చికెన్ రోల్ ను ఆర్డర్ చేశారు. చికెన్ మోమోస్ 16.3 లక్షల ఆర్డర్లతో రెండవ స్థానంలో ఉన్నాయి. పొటాటో ప్రైస్ 13 లక్షల ఆర్డర్లతో మూడో స్థానంలో ఉన్నాయి. కస్టమర్లు కోరుకున్న ఆహార పదార్థాలను రవాణా చేయడానికి స్విగ్గి డెలివరీ బాయ్స్ మొత్తం 1.96 బిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 5.33 లక్షల సార్లు ప్రయాణించడంతో సమానం అని స్విగ్గి చెబుతోంది. స్విగ్గిలో 10,703 ఆర్డర్లను సర్వ్ చేసి, ముంబై నగరానికి చెందిన కపిల్ కుమార్ పాండే హైయెస్ట్ డెలివరీ బాయ్ గా పేరుపొందాడు. కాళేశ్వరి అనే కోయంబత్తూర్ మహిళ 6,658 ఆర్డర్లను అందించి రెండవ స్థానంలో నిలిచింది.