Hyderabad: హైదరాబాదులోని మాతృదేవో అనాధాశ్రమం.. అక్కడ ఉన్న వృద్ధులకు, ఇతరులకు అన్నదానం చేసేందుకు ఇద్దరు యువతులు వెళ్లారు. వారిద్దరూ సొంత అక్కా చెల్లెళ్లు. వారు ఆ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదానం చేశారు. ఆ సమయంలో ఒక వ్యక్తిని చూసి గుండెలు పగిలే విధంగా ఏడ్చారు. వెంటనే అతడిని గుండెలకు హత్తుకున్నారు. వారిద్దరి తండ్రి మతిస్థిమితాన్ని కోల్పోయాడు. ఆరు సంవత్సరాలుగా ఆ ఆశ్రమంలోనే ఉంటున్నాడు. అతడిని వారిద్దరి కూతుళ్లు ఆరు సంవత్సరాల క్రితం చేర్పించారు. ఆ ఆశ్రమానికి వారికి తోచినంత విరాళాన్ని ఇస్తూ ఉంటారు. ఆ ఆశ్రమంలో 130 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారు. అయితే అన్నదానం చేస్తున్నప్పుడు ఆ 130 మందిలో తమ తండ్రిని గుర్తించారు. వెంటనే అతని వద్దకు వెళ్లారు. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 130 మందిలో తమ తండ్రిని చూసి ఏడ్చారు. అతనితో ఉన్న తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బాధపడ్డారు.
అల్జీమర్స్ వచ్చింది
హైదరాబాద్ చెందిన ఆ వ్యక్తికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు సంతానం. అయితే అతడు ఏడు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. అంతకుముందు అతడు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసేవాడు. పిల్లల్ని కూడా మంచి పాఠశాలల్లో చదివించాడు. భార్యను కూడా బాగా చూసుకునేవాడు. అయితే విధి నిర్వహణలో ఏర్పడిన ఒత్తిడి వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. అతడి తన తల భాగంలో నొప్పి ఉందని బాధపడేవాడని.. ఎన్ని ఆస్పత్రులలో చూపించినా నయం కాలేదని అతడు కూతుర్లు చెబుతున్నారు. చివరికి అల్జీమర్స్ వచ్చిందని.. ఏదీ గుర్తించలేకపోతున్నాడని.. చివరికి గత్యంతరం లేక ఆశ్రమంలో చేర్పించాల్సి వచ్చిందని వారు వివరిస్తున్నారు. ” మా నాన్న కృషి వల్లే మేము ఇలా ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ రోజుల్లోనే కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాడు. మా నాన్న బాగుంటే మా స్థాయి ఇంకా బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు మా పరిస్థితి ఇలా ఉంది. మా నాన్నను అలా చూస్తే బాధ అనిపించింది. కానీ ఏం చేయగలం? మా నాన్నను మేము గుర్తుపట్టినా.. ఆయన మమ్మల్ని గుర్తించలేడు.. ఇంతటి కష్టం ఎవరికీ రావద్దు. ఇంతటి బాధ మరొకరు పడొద్దని” ఆ ఇద్దరు సోదరీమణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో ట్రెండ్ అవుతోంది. చూసిన వారందరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ కూతుళ్లు తమ తండ్రిని మర్చిపోలేదు. అతని వాత్సల్యాన్ని విస్మరించలేదు. నేటి ఆధునిక కాలంలో ఇలాంటి కూతుళ్లు చాలామందికి ఆదర్శమని నెటిజన్లు సామాజిక మాధ్యమాలలో పేర్కొంటున్నారు.
కంటతడి పెట్టించే సన్నివేశం
మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన తండ్రిని ఆరేళ్ల తర్వాత అనాధాశ్రమంలో చూసి కూతుళ్ల భావోద్వేగం
హైదరాబాద్లోని మాతృదేవోభవ అనాధాశ్రమానికి అన్నదానం చేయడానికి వెళ్లిన కూతుళ్లు
మతిస్థిమితం కోల్పోయి ఆరేళ్లుగా అక్కడే ఉంటున్న తండ్రిని చూసి గుర్తుపట్టిన కూతుళ్లు… pic.twitter.com/zK0MdEHlJF
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2024