HomeతెలంగాణCM Revanth Reddy: హేమాహేమీలు ఉన్నా.. బీఆర్ఎస్ చేతిలో ఎందుకిలా.. రేవంత్ ఆలోచించాల్సిన విషయం ఇది..

CM Revanth Reddy: హేమాహేమీలు ఉన్నా.. బీఆర్ఎస్ చేతిలో ఎందుకిలా.. రేవంత్ ఆలోచించాల్సిన విషయం ఇది..

CM Revanth Reddy: పిఆర్ టీమ్ ను వాడుకోవడంలో భారత రాష్ట్ర సమితి ఇప్పటికీ ముందు వరుసలోనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఒక ఆట ఆడుకుంటున్నది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్.. ఇలా ఏ వేదిక చూసుకున్నా భారత రాష్ట్ర సమితి అనుకూల పాత్రికేయుల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అనుబంధ సోషల్ మీడియా విభాగం వెనుకబడినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వానికి సంబంధించి భారత రాష్ట్ర సమితి చేస్తున్న ఆరోపణలను, విమర్శలను తిప్పి కొట్టడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం వెనకడుగు వేస్తోంది. స్వయానా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ భారత రాష్ట్ర సమితి నాయకులు విమర్శలు చేస్తున్నప్పటికీ నిశ్శబ్దాన్ని పాటిస్తోంది. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. అయితే ఇది నిరాటంకంగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. అనేక కష్టాలు పడి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పి ఆర్ టీమ్ ను సరిగ్గా వాడుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని నిరూపించే ఘటనలు అనేకం జరిగినప్పటికీ ఆయన దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.

ప్రచారం చేసుకోవడంలో విఫలం

మంగళవారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పర్యటించారు. కుల గణనపై స్పష్టత ఇచ్చారు. ఇదే విధానాన్ని తాము అధికారంలోకి వస్తే దేశం మొత్తం అమలు చేస్తామని వివరించారు. వాస్తవానికి ఇది ఎంతో గొప్ప నిర్ణయం. కొంతమంది దీనిని విమర్శించినప్పటికీ.. మనదేశంలో కుల వ్యవస్థ ఇప్పటికీ బలంగానే ఉంది. అయితే దీనిని గొప్పగా ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని కంటే ముందు రాహుల్ గాంధీ నిరుద్యోగులతో భేటీ అవుతారని ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ఓ పోలీస్ అధికారి లీక్ చేశారు. వెంటనే కేటీఆర్ తన బృందంతో కలిసి అక్కడికి వెళ్లిపోయారు. అక్కడ సీట్లు మొత్తం కబ్జా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుక కరుచుకున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ టూర్ లో అనేక మార్పులు చేశారు. స్థూలంగా చెప్పాలంటే ఇవాల్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు చిక్కలేదు. పోలీసులపై, సీనియర్ అధికారులపై అజామాయిషీ లేదు. ఇవాల్టికి భారత రాష్ట్ర సమితి మనుషులే పోలీసులపై అధికారం సాగిస్తున్నారు. అధికార యంత్రాంగంలో పెత్తనం చెలాయిస్తున్నారు.

స్పష్టత లేకుండా పోయింది

రాహుల్ గాంధీ ప్రోగ్రాం విషయంలోనూ ఒక సరైన స్ట్రాటజీ కాంగ్రెస్ పార్టీ పాటించలేదు. దానికి దశ దిశ అంటూ చూపించలేదు. ఇక పార్టీ పరంగా రేవంత్ గా లభిస్తున్న సపోర్టు దాదాపు శూన్యం. రోజుకు అనేక రకాలుగా రేవంత్ ను హరీష్, కేటీఆర్ ఆడుకుంటున్నారు. అయినప్పటికీ వారికి గట్టి కౌంటర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం లేదు. మొత్తంగా చూస్తే కౌంటర్ మెకానిజం అనేది రేవంత్ దగ్గర లేనట్టు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాదికాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. వచ్చే రోజుల్లో ఇంకెలా ఉంటుందో.. ఇప్పటికైతే ఎన్నికలకు నాలుగు సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ.. భారత రాష్ట్రానికి మాత్రం నేడో, రేపో ఎన్నికలన్నట్టుగా హడావిడి చేస్తోంది. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేస్తోంది. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేల్కొంటుందా? దాని అనుబంధ సోషల్ మీడియా విభాగం జీవసత్వాలు నింపుకుంటుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కౌంటర్ మెకానిజానికి శ్రీకారం చుడుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular