KTR: తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ను వీలైనంత డ్యామేజీ చేయడానికి అధికార బీఆర్‌ఎస్ నేతలు ప్రతీ అవకాశాన్ని విపరీతంగా వాడుకుంటున్నారు. ఇప్పటికే డీకే.శివకుమార్ చెప్పిన ఐదు గంటల కరెంటుపనై సీఎం కేసీఆర్ నుంచి కిందిస్థాయి నేతల వరకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 24 గంటల కరెంటు అని ప్రకటించినా..గృహ విద్యుత్ 200 యూనిట్లు ఉచితం అని పేర్కొన్నా.. గులాబీ నేతలు మాత్రం డీకే.శివకుమార్ కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామంటున్నారు. తెలంగాణలో గెలిస్తే అదే 5 గంటలు ఇస్తారని జనంలోకి తీసుకెళ్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌పై
తాజాగా బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌ను బూచిగా చూపి హైదరాబాద్ ప్రజలను భయపెడుతున్నారు. మొన్ననే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్ అమరావతి అవుతుందని హెచ్చరించారు. నగర ఓటర్లు అలోచించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాజాగా ముఖ్యమైన మంత్రి కేటీఆర్ కూడా అదే పల్లవి అందుకున్నారు.
రియల్ ఎస్టేడ్ ఢమాల్ అంట..
తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో ఓటీవీ చానెల్ నిర్వహించిన రియల్టర్ల సమావేశానికి వెళ్లారు. ఈసందర్భంగా ఓ ఆసక్తికర కథనం చెప్పారు. ఎన్నికల సమయం కావడంతో ఈ వేదికను కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతుందని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇందుకు కారణంగా ఓ కథ చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే ఆరు నెలలకు ఓ ముఖ్యమంత్రి మారతారని, ఈ కారణంగా ఆ ముఖ్యమంత్రి సీటు సర్దుకునేలోపే ఆ పార్టీ నేతలు మళ్లీ ఆయనను లాగేసి మరో ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని తెలిపారు. ఈ కారణంగా హైదరాబాద్ అభివృద్ధిని పట్టించుకోరని, అస్థిర ప్రభుత్వం కారణంగా భూముల ధరలు పడిపోతాయని వెల్లడించారు. కేసీఆర్ సీఎం అయితేనే హైదరాబాద్‌లో భూముల ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు.
భూములకు లేని ఫైప్ తెస్తూ..
వాస్తవంగా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తే.. ధనవంతులు మాత్రమే ధనవంతులుగా మారుతున్నారు. సామాన్యుడు రాజధానిలో గజం భూమి కూడా కొనే పరిస్థితి లేదు. సొంత ఇల్లు కట్టుకుందామంటే ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితి కానరావడం లేదు. ఒకవైపు రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెంచింది అధికార బీఆర్‌ఎస్. భూముల ధరలను కూడా భారీగా పెంచుతూ పోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల బినామీలతో ఎక్కడా లేని ధరలు చెల్లించి వేలంలో భూములు కొనుగోలు చేయిస్తోంది. ఇటీవలే కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లకుపైగా విక్రయించింది. ఇలా భూములకు లేని ఫైప్ తెస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. కాంగ్రెస్ వస్తే ధరలు పడిపోతాయని ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం కూడా తమ బినామీలు కొన్న భూముల పరిరక్షణ కోసమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది – మంత్రి కేటీఆర్ pic.twitter.com/3Q28wnYtDf
— Telugu Scribe (@TeluguScribe) November 23, 2023