Jubilee Hills By Election Result 2025: ప్రజాస్వామ్యం అన్నాక ఎన్నికలు జరుగుతుంటాయి. జనాధారణ ఉన్నవారు గెలుస్తారు. జనాల నమ్మకాన్ని పొందలేని వారు ఓడిపోతుంటారు. క్రీడల్లో గెలుపు ఓటములు ఎలా అయితే సహజమో, రాజకీయాలు అన్నాక కూడా ఓటమి గెలుపులు అంతే సహజం. గెలిచినవారు విర్రవీగకూడదు.. ఓడిపోయిన వారు వికృతానికి పాల్పడకూడదు. తెలంగాణలో ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో రాజకీయాలు పూర్తిగా వ్యక్తిగతమైపోయాయి. నచ్చని నాయకులపై కేసులు పెట్టించడం.. జైళ్లల్లో పెట్టించడం సర్వసాధారణమైపోయింది. పైగా రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని ఉగ్రవాదులను వేసే లాకప్ లో వేసి ఇబ్బంది పెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
ఈ పరిణామాలు సహజంగానే గులాబీ పార్టీపై ప్రజల్లో ఆగ్రహం కలిగించేలా చేశాయి. అందువల్లే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఓటమిపాలైంది.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలను సాధించింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిపాలైంది.. రెండు పర్యాయాలు అధికారాన్ని.. ఎదురైన ప్రతి ఉప ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న గులాబీ పార్టీ.. ఇన్ని రకాలుగా పరాభవాన్ని ఎదుర్కొంటున్నది అంటే దానికి కారణమేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వాస్తవానికి గులాబీ పార్టీ చేసిన కొన్ని తప్పులు స్వయంకృతాపరంగా మారిపోయాయి. అందువల్లే తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఆ పార్టీని క్షమించలేకపోతున్నారు.. మూడో స్థానం నుంచి రెండో స్థానానికి వచ్చామని గులాబీ పార్టీ నాయకులు సంబరపడుతున్నప్పటికీ.. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా ప్రచారం చేసి ఉంటే ఆ పార్టీకి ఆస్థానం కూడా వచ్చి ఉండేది కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట.
ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి.. విలువల గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత అది కూడా గులాబీ పార్టీ దానిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో అత్యుత్సాహం పెరిగిపోయింది. మితిమీరిన ఆనందంలో కారుకు గులాబీ రంగు వేసి.. దానికి కెసిఆర్, కేటీఆర్ అని పేరు పెట్టి.. జెసిబి తో ఊరేగించారు. ఆ తర్వాత తుక్కుతుక్కు చేశారు. ఇప్పటికి తెలంగాణ ప్రజల్లో గులాబీ పార్టీ చేసిన దౌర్జన్యాలకు సంబంధించి ఆగ్రహం అలానే ఉంది. ప్రజలు కూడా ప్రతి ఎన్నికలో తమ ఆగ్రహాన్ని చూపిస్తూనే ఉన్నారు. కానీ ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోయినట్టున్నారు. అందువల్లే గెలిచిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.
గులాబీ పార్టీ మీద కాంగ్రెస్ నాయకులకు కోపం ఉండడం సహజం. ఎందుకంటే గడచిన పదేళ్లలో ఆ పార్టీ నాయకులను గులాబీ నేతలు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.. కేసుల పాల్చేశారు. అవన్నీ మనసులో పెట్టుకొని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఇలా చేస్తే ప్రజలు మరో విధంగా తీసుకుంటారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తదుపరి ఎన్నికల్లో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పైగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అందువల్లే గెలిచిన ప్రతి సందర్భంలోనూ ఒదిగి ఉండాలి. ప్రజల మన్ననలు పొందుతూ ఉండాలి.. ప్రజలు ఇచ్చే తీర్పు కంటే గొప్ప శిక్ష ఏముంటుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకుంటే మంచిది.
AFTER WINNING AN ELECTION!!!
Visuals from the VICTORY RALLY of Congress in the Jubilee Hills By-Poll, taken out to “celebrate”
Old cars coloured in pink (BRS symbol & color) with names of KCR & KTR graffitis were broken, dragged and hung around massive cranes.
Well! This is… pic.twitter.com/OzV8Wj4O92
— Revathi (@revathitweets) November 14, 2025