Local Body Elections In Telangana: ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాగుతోంది. రేపో, మాపో నోటిఫికేషన్ విడుదలవుతుంది అనుకుంటున్న క్రమంలో.. అప్పట్లో బ్రేకులు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభ ఆమోదించింది. గవర్నర్ దృష్టికి ఫైల్ తీసుకెళ్ళింది. అయితే ఇంతవరకు ఆ దస్త్రానికి ఆమోదముద్రం పడలేదు.
ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, అందువల్లే బీసీలకు రిజర్వేషన్లు అనే నాటకాన్ని ఆడుతోందని ఆరోపించింది. అటు గవర్నర్ బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన దస్త్రంపై సంతకం పెట్టకపోవడం.. ఇంకా రకాల పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తన నిర్ణయం వెల్లడించారు. బీసీ సంక్షేమ ముఖ్య కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 9 విడుదల చేశారు. అదే కాదు ఆర్టికల్ 40 ప్రకారం రాష్ట్ర పాలసీని ప్రకటించారు. రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 41, 42 ను పంచాయతీ రాజ్ కార్యదర్శి ప్రకటించారు. అదే కాదు మహిళా రిజర్వేషన్లు కూడా వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రామాలు, పట్టణాలలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. సామాజిక ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే ఆధారంగా బీసీలకు ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది.. అంతేకాదు బీసీ డెడికేషన్ కమిషన్ అందించిన నివేదిక ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పించామని ప్రభుత్వం ప్రకటించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పార్టీ ప్రకారం స్టేట్ లో 69 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలలో వర్తింప చేయడం కష్టమే. ఒకవేళ న్యాయస్థానం దీనికి తిరస్కరిస్తే పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని న్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. అయితే పాలసీమేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం జీవద్వారా ప్రకటించింది. దీని ద్వారా స్థానిక ఎన్నికలు బీసీలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. షెడ్యూల్ ఏరియాలో ఎస్టీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా మొత్తం సీతలో 50% తగ్గకుండా రిజర్వేషన్ అమలు చేస్తారు. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీనికోసం బీసీ డిటేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. దాదాపు లక్ష మంది ఎన్యూమరేటర్లు ఇంటింటా తిరుగుతూ వివరాలు సేకరించారు. ప్రజల నుంచి సేకరించిన వివరాలను కంప్యూటరీకరించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం బీసీలకు సంబంధించి రెండు బిల్లులు ప్రవేశపెట్టి.. అసెంబ్లీలో ఆమోదింప చేసింది. ఆ తర్వాత గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళింది. అక్కడ బిల్లులు పెండింగ్లో ఉండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టికల్ 40 ప్రకారం జీవో నెంబర్ 9 ని తీసుకొచ్చింది. దీన్ ప్రకారం పంచాయతీరాజ్, మునిసిపల్ పాలకవర్గాలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తారు.