https://oktelugu.com/

IAS vs IPS : ఐఏఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్‌.. హైడ్రా విఫయంలో రంగనాథ్, అమ్రాపాలి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం

తెలంగాణలో పది నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ పాలన సాఫీగా సాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటీగా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఐపీఎస్, ఐఏఎస్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 7, 2024 / 06:27 PM IST

    Ranganath vs Amrapali

    Follow us on

    IAS vs IPS : తెలంగాణలో ఇప్పుడు హైడ్రానే హాట్‌ టాపిక్‌. హైదరాబాద్‌లో ఆక్రమణల కూల్చివేతను మొదట హైదరాబాదీలతోపాటు తెలంగాణ అంతా స్వాగతించింది. అయితే రానురాను హైడ్రా దూకుడుపై విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి మానస పుత్రిక అయిన హైడ్రాకు ఐపీఎస్‌ రంగనాథ్‌ కమిషనర్‌గా ఉన్నారు. ఇటీవల హైకోర్టు కూడా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను మందలించింది. తాజాగా హైడ్రా కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ మధ్య హైడ్రా చిచ్చు పెట్టింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఐఏఎస్‌ అమ్రాపాలి జీహెచ్‌ఎంసీ సిబ్బంది హైడ్రాలో పనిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఐఏఎస్, ఐపీఎస్‌ మధ్య ప్రచ్ఛన్నయుద్ధంగా మారింది. ఇద్దరి దూకుడు.. ఇటు అధికారవర్గాల్లో, అటు రాజకీయవర్గాలో చర్చనీయాంశంగా మారింది.

    సిబ్బంది కేటాయింపు..
    హైడ్రా ఏర్పాట చేసిన కొత్తలో ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ సిబ్బందిని హైడ్రాకు కేటాయించింది. మూడు నెలలుగా హైడ్రాకు పనిచేస్తున్న సిబ్బంది జీహెచ్‌ఎంసీ నుంచి జీతం తీసుకుంటున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అమ్రాపాలీ తమ సిబ్బందిని తిరిగి పంపాలని కోరుతున్నారు. వారు చేయాల్సిన పనులు జీహెచ్‌ఎంసీలో పెండింగ్‌లో ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని అమ్రాపాలి కాటా దృష్టికి తీసుకెళ్లారు. వారి వేతనాలు నిలిపివేయాలని కోరారు. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ నుంచి కేటాయించిన విజిలెన్స్‌ అధికారులు తిరిగి తమకు పంపించాలని హైడ్రా కమిషనర్‌కు లేఖ రాశారు. అయినా వారు హైడ్రా పరిధిలోనే పనిచేయడంపై అమ్రాపాలి అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీకి రావాల్సిన సిబ్బందికి డెడ్‌లైన్‌ విధించారు. ఆలోగా రాకుంటే శాలరీలు నిలిపివేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక శాఖకు కూడా లేఖ శారు. అయినా విజిలెన్స్‌ సిబ్బంది హైడ్రాలోనే పనిచేస్తున్నారు.

    ఆ ఫిర్యాదులన్నీ హైడ్రాకే..
    ఇదిలా ఉంటే.. గతంలో జీహెచ్‌ంఎసీకి వచ్చే ఫిర్యాదులన్నీ ఇప్పుడు హైడ్రాకు వస్తున్నాయి. ఇది కూడా అమ్రాపాలికి మింగుడు పడడం లేదు. హైడ్రా కారణంగా జీహెచ్‌ఎంసీ ప్రాధాన్యం తగ్గుతున్నట్లు అమ్రాపాలి భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆమె హైడ్రా కమిషనర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది.

    హైడ్రా నుంచి జీహెచ్‌ఎంసీకి..
    ఇదిలా ఉంటే.. హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్నింటిని కమిషనర్‌ రంగనాథ్‌ జీహెచ్‌ఎంసీకి పంపుతున్నారు. జీహెచ్‌ఎంసీ పనుల్లోనే సిబ్బంది బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో హైడ్రా నుంచి వచ్చిన ఫిర్యాదులు చూడడం సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. ఇది కూడా గ్రేటర్‌ అధికారుల ఆగ్రహానికి కారణమవుతోంది. పీక్స్‌కు చేరుతున్న ఐఏఎస్, ఐపీఎస్‌ వార్‌.. ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.