https://oktelugu.com/

CM Revanth Reddy: ఆయన ఏమైనా ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో నిల్చొని యుద్ధం చేశాడా అంటూ అల్లు అర్జున్ పై విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి!

తెలుగు చలన చిత్ర పరిశ్రమకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన వారిలో ఒకరైన అల్లు అర్జున్ కి ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని సోషల్ మీడియా లో పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 13, 2024 / 08:40 PM IST

    CM Revanth Reddy

    Follow us on

    CM Revanth Reddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై సోషల్ మీడియా లో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు లాయర్ నిరంజన్ రెడ్డి చొరవతో అల్లు అర్జున్ కి ఎన్నో నాటకీయ కోణాల మధ్య బెయిల్ ఇంటెర్మ్ బెయిల్ లభించింది. నాలుగు వారాలు తర్వాత ఆయన నాంపల్లి హై కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దురదృష్టం కొద్దీ జరిగిన ఈ సంఘటన కి కేవలం అల్లు అర్జున్ ఒక్కడినే భాద్యుడిని చేయడం సరికాదని, ఎదో ఆయన కావాలని చేసినట్టు, పోలీసులు నేరుగా అతని ఇంటి బెడ్ రూమ్ లోకి దూరి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అన్యాయమని, తెలుగు చలన చిత్ర పరిశ్రమకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన వారిలో ఒకరైన అల్లు అర్జున్ కి ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని సోషల్ మీడియా లో పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

    ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి ఈ ఘటనపై చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ ఏమైనా ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో నిల్చొని యుద్ధం చేశాడా?, అతను కేవలం ఒక సినిమా హీరో. ఈ దేశం లో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్త్ లాంటి సూపర్ స్టార్స్ అరెస్ట్ అవ్వలేదా?, పుష్ప 2 చిత్రానికి నిర్మాతలు కోరిన వెంటనే మేము బెనిఫిట్ షోస్ కి అనుమతిని లంచం. సరైన ప్రోటోకాల్స్ లేకుండా ఆయన థియేటర్ కి వచ్చాడు. కారెక్కి నమస్కారం చేస్తూ ర్యాలీ కూడా చేసాడు. అలా చేయడం వల్లనే అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి. అతని కారణంగా ఒక మహిళ చనిపోయింది. ఒక పసి బిడ్డ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనిని మేము తేలికగా వదిలేయాలా?, దీనిపై మేము కేసు పెట్టి చర్యలు తీసుకోకపోయితే , జనాలు పెట్టలేదని మమ్మల్ని అడగరా?, తప్పు ఎవరు చేసినా తప్పే చట్టానికి ఎవ్వరూ అతీతులు కారు’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ సైలెంట్ గా వచ్చి సినిమా చూసి వెళ్లిపోకుండా, కారు ఎక్కి చాలా హంగామా సృష్టించాడు. జనాలు ఎక్కువ ఉన్న చోట ఒక సెలబ్రిటీ వస్తే ఎలా ఉంటుందో అతనికి ఆ మాత్రం తెలియదా?, పోలీసులు వద్దని చెప్తున్నా కూడా లెక్క చేయకుండా ప్రోటోకాల్స్ ని ధిక్కరిస్తే ఏమి చెయ్యాలో మీరే చెప్పండి. అతనికి స్పెషల్ షో చూడాలని అనిపిస్తే ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది , లక్షణంగా చూసుకోవచ్చు కదా, ఇలా లేనిపోని హంగామా సృష్టించడం ఎందుకు’ అంటూ ఆయన సూటి ప్రశ్నలు వేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అల్లు అర్జున్ తీరుని తప్పు పెట్టేవాళ్ళు కొందరుంటే, మరి కొందరు మాత్రం ఆయనని సమర్థిస్తున్నారు.