KTR: కేటీఆర్ కు రేవంత్ షాక్.. ఒక్క దెబ్బకు మేఘా, కేశవాపురం ఔట్!

"మూసి పునరుద్ధరణ పనులు మేఘా కంపెనీకి కట్టబెడుతున్నారు.. వేల కోట్లు దోచుకునేందుకు పన్నాగం పన్నుతున్నారు. మూసి బ్యూటిఫికేషన్ కాదు అది.. ముమ్మాటికి లూటిఫికేషన్.." ఇవీ ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ పై కేటీఆర్ చేస్తున్న విమర్శలు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 7, 2024 8:52 am

Revanth Reddy-KTR

Follow us on

KTR: దానికి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇవ్వలేక.. దాని వద్ద కౌంటర్ మెకానిజం లేక పోవడంతో భారత రాష్ట్ర సమితి రెచ్చిపోయింది. దాని అనుబంధ సోషల్ మీడియా విభాగం మరింత ప్రచారం చేసింది. అయితే సరిగ్గా ఇన్ని రోజులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించింది. గత భారత రాష్ట్ర సమితి హయాంలో జరిగిన ఒప్పందాలలో ఒకటైన కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ పనులను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని భారీ వ్యయంతో చేపట్టాలని నాడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే జలాశయ నిర్మాణాన్ని రద్దు చేస్తూ.. అత్యంత తక్కువ ఖర్చుతో హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించడానికి కొత్త ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదు జంట నగరాలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గోదావరి ఫేజ్ -2 ప్రాజెక్టు కింద పది టీఎంసీల సామర్థ్యంతో దీనిని నిర్మించాలని భావించింది.

నీరు ఎలా వస్తుందంటే?

కేశవాపురం రిజర్వాయర్ కు కొండపోచమ్మ సాగర్ నుంచి నీరు వస్తుంది. ఆ నీటిని హైదరాబాద్ నగరానికి తరలించాలని నాడు భావించారు. 4,777.59 కోట్ల అంచనా తో కేశవాపురం వద్ద నిర్మించాలనుకున్న జలాశయానికి 2018 ఫిబ్రవరి 3న నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను ఇచ్చింది. టెండర్లను ఆహ్వానిస్తే మెఘా కంపెనీ 3,918 కోట్లకు దక్కించుకుంది. చెల్లింపులను హైబ్రిడ్ యాన్యుటి పద్ధతిలో చదివించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ప్రకారం 10 సంవత్సరాలలో 6,891 ఓట్లకు పైగా చెల్లింపులను జరపడానికి వాటర్ బోర్డుతో అంగీకారం కూడా చేసుకుంది.

ఆ సంవత్సరాలుగా పనులు లేవు

అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించిన నమూనాల ప్రకారం ప్రాజెక్టును నిర్మించాలంటే అటవీ భూములు, రక్షణ భూములను సేకరించాల్సి ఉంది. దీంతో ఆరు సంవత్సరాలుగా ప్రాజెక్టు పనులను మేఘా చేపట్టలేదు.. రెవెన్యూ శాఖ, వాటర్ బోర్డు అధికారులు కూడా సక్రమంగా పనిచేయలేదు. పైగా నాటి ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మాణానికి అంతగా ఆసక్తి చూపలేదు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం ఏకంగా 1,011 ఎకరాల భూమి ఇచ్చింది. అయినప్పటికీ అందులో పనులు చేపట్టలేదు. 2017 నాటి రేట్లతో తాము పనులు చేపట్టలేమని.. 2024 రేట్ల ప్రకారం చేస్తామని మేఘా ప్రభుత్వానికి స్పష్టం చేయడంతో.. ప్రభుత్వం దానిని తిరస్కరించింది. ఇప్పటివరకు పనులు చేపట్టని క్రమంలో అటెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేశవాపురం జలాశయ నిర్మాణం అత్యధికమైన ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. దానికంటే తక్కువ ఖర్చుతో, బహుళ ప్రయోజనాలు ఉండేవిధంగా కొత్త ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేశవాపురం జలాశయం కాకుండా హైదరాబాద్ నీటి అవసరాల కోసం.. గోదావరి ఫేజ్ -2 పథకంలోని మల్లన్న సాగర్, హిమాయత్ సాగర్ కు గోదావరి నీరును మళ్లిస్తారు. హైదరాబాద్ కు పది టీఎంసీలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు 5 టీఎంసీల మీరు సరఫరా చేస్తారు. ఇక ఇతర అవసరాల కోసం మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీలు నీరు తరలిస్తారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీనివల్ల ప్రభుత్వానికి 2000 కోట్ల వరకు ఆదా అవుతోంది. కేశవాపురం రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ జంట నగరాలకు నీటి సరఫరా చేయాలంటే.. సంవత్సరానికి ఆరుసార్లు నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోయాల్సి ఉంటుంది. అయితే తాజా ప్రతిపాదనతో ఎక్కువ శాతం నీరు అవిటి ద్వారానే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వస్తుంది. ఫలితంగా విద్యుత్ ఖర్చు ఎక్కువగా ఉండదు. దీని ద్వారా కేవలం 44 రూపాయలతోనే 1000 లీటర్ల నీరు జలమండలి సరఫరా చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఇది 48 రూపాయలుగా ఉండేది. ఇక హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకంగా ఉన్న గోదావరి ఫేజ్ -2 పనులకు త్వరలోనే 5,560 కోట్లతో టెండర్లు పిలవడానికి వాటర్ బోర్డు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.