Hasitha Bhashpalu Book Release: మేధావులు, బుద్ధి జీవులు, కవులు, కళాకారులు న్యూట్రల్ గా ఉంటారని.. సమాజానికి హితమైన విధానంలోనే వారు ప్రయాణం సాగిస్తారని ఒక నమ్మిక. అదంతా బూటకమని.. మేధావులు, బుద్ధి జీవులు, కవులు, కళాకారులు న్యూట్రల్ గా ఉండరని.. వారు ఒక పక్షానికి కొమ్ముకాస్తారని గడచిన పది సంవత్సరాల కాలంలో తేలింది.. కొంతమంది కవులు, కళాకారులు గత ప్రభుత్వానికి ఏకపక్షంగా తమ సమ్మతిని తెలియజేయడం.. గులాబీ కండువా కప్పుకున్న కార్యకర్తల కంటే ఎక్కువ మాట్లాడటం సభ్య సమాజాన్ని నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: అలాస్కా లో రహస్య పత్రాలు.. ట్రంప్, పుతిన్ భేటీ లో ఇన్ని భద్రతా లోపాలా?
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. జయ జయహే తెలంగాణ ను రాష్ట్ర గీతంగా మార్చారు. అందెశ్రీకి గౌరవం ఇచ్చారు. ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ అందెశ్రీని రేవంత్ గౌరవిస్తూనే ఉన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలను మననం చేసుకుంటూనే ఉన్నారు. కాకపోతే మిగతావారి లాగా అందెశ్రీ రేవంత్ ప్రభుత్వానికి జై కొట్టడం లేదు. ఏకపక్షంగా తన సమ్మతిని తెలియజేయడం లేదు.. ఇప్పటికీ తన న్యూట్రాలిటీని ఆయన ప్రదర్శిస్తూనే ఉన్నారు. తెలంగాణ వికాసంలో తన వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు. అయితే శనివారం ఆధ్యాత్మికవేత్త రచయిత శ్రీరామ్ రచించిన హసితభాష్పాలు అనే గ్రంధాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ఆవిష్కరించారు. దీనిని అందెశ్రీ ప్రచురించారు. ఇదే సమయంలో తనను చావు చివరి అంచు నుంచి బయటకు తీసుకొచ్చిన గురువు శ్రీరామ్ కు అందెశ్రీ ధన్యవాదాలు చెప్పారు. ఆయన రచించిన పుస్తకాన్ని ప్రచురించే అవకాశం తనకు లభించడం పట్ల అందెశ్రీ పూర్వజన్మ సుకృతం లాగా అభివర్ణించుకున్నారు. సహజంగానే ఈ కార్యక్రమంలో లోపాలను వెలికి తీయడానికి భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా బలంగా కంకణం కట్టుకుంది. దాని అనుకూల నెటిజన్లు కూడా అదే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. నిన్న రాత్రి నుంచి ఇదే పనిలో ఉన్నారు.
అందెశ్రీ ప్రసంగంలో కొన్ని బిట్లు కట్ చేసి ట్రోల్స్ మొదలుపెట్టారు.. అందెశ్రీ తను నిర్మించుకుంటున్న కొత్త ఇంటికి శనివారం స్లాబ్ వేయించారు. కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కరోదైనా వర్షం రాకుండా చూడమని శ్రీరామ్ ను అందెశ్రీ యథాలాపంగా అడిగారట. దానికి వర్షం రాదు.. మీరు నిరభ్యంతరంగా స్లాబ్ వేసుకోమని శ్రీరామ్ చెప్పారట. దీంతో అందెశ్రీ ధైర్యంగా స్లాబ్ వేయించుకున్నారు. అంతేకాదు ఆయన కోరుకున్నట్టుగానే వర్షం కూడా పడలేదు. వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ.. ప్రభుత్వం ఎలర్ట్ లు జారీ చేసినప్పటికీ శ్రీరామ్ ఆశీస్సుల వల్ల వర్షం పడలేదంటూ అందెశ్రీ తన గురుభక్తిని వేదిక మీద చాటుకున్నారు. కానీ అందెశ్రీ రేవంత్ రెడ్డి ని పొగిడారని..”వీర లెవెల్ లో భజన చేస్తున్నావ్.. కానీ చెక్కభజన మాత్రం వద్దు. కోటి రూపాయలు ఇచ్చిన రేవంత్ ను ఈ స్థాయిలో పోడాల్సిన అవసరం ఏముందని” గులాబీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రేవంత్ ను ఉద్దేశించి కొన్ని బిట్స్ కూడా కలిపి వీడియోలు రూపొందించి.. సోషల్ మీడియాలో ట్రోల్ దర్జాగా సాగిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తొమ్మిది మంది ఉద్యమ కవులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నజరానా ప్రకటించింది. 300 గజాల ఇంటి స్థలాన్ని కూడా అందించింది. దానికి సంబంధించిన కాగితాలను కూడా వారికి అందజేసింది. ఇందులో అందెశ్రీ కూడా ఉన్నారు. అందువల్లే ఆయన రేవంతును పొగిడారని గులాబీ అనుకూల మీడియా ఆరోపిస్తోంది.
కానీ ఇక్కడ శ్రీరామ్ గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆయన ఎంతో మహత్తు ఉన్న ఆధ్యాత్మికవేత్త. ఆయనతో రెండంటే రెండు నిమిషాలు మాట్లాడితే సరిపోతుందని అనుకునే వారు చాలామంది ఉంటారు. బహుశా అందువల్లే వర్షాన్ని ఆపగలిగారని అందెశ్రీ వ్యాఖ్యానించి ఉంటారు. అయితే ఈ విషయాన్ని చెప్పొద్దో, చెప్పకూడదో.. అనుకుంటూనే అందెశ్రీ వేదిక మీద ఆ మాటలు మాట్లాడారు. వాస్తవానికి అందెశ్రీ రేవంత్ ను ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడలేదని.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారికి తెలుసు. పూర్తి వీడియోను వీక్షించిన వారికి ఇంకా తెలుసు. అధికారం కోల్పోయి.. చాలా సమస్యలు ఎదుర్కొంటూ గులాబీ పార్టీ ఇప్పుడు సోషల్ యుద్ధం చేస్తోంది. రేవంత్ ప్రభుత్వంలో ఏమాత్రం చిన్న లోపం కనిపించినా దానిని కొండంతలు చేస్తోంది.