CM Revanth Reddy And Salman Khan: క్రీడాకారులను వెలికి తీసుకురావడానికి.. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారు. ఒలింపక్స్ నిర్వహించే స్థాయికి దేశం ఎదగాలని, దేశంలో ముఖ్యంగా తెలంగాణ క్రీడాకారులు ఒలింపక్స్‌లో పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఈమేరకు క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో రోనాల్డో తెలంగాణకు రాబోతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో మోటార్ స్పోర్ట్స్ రేస్‌కు సీఎం హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు. ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పర్యవేక్షణలో బిజీగా ఉన్నా.. క్రీడలపై ఉన్న ఆసక్తితో ఆయన మోటార్ స్పోర్ట్స్‌కు వచ్చారు.
ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ప్రారంభోత్సవం
గచ్చిబౌళి లోని జీఎంబీసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయతతో భారతీయ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ప్రారంభోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకకి అందరూ అదేవిధంగా ఆకర్షితులయ్యారు.
సల్మాన్ ఖాన్ స్పెçషల్ అట్రాక్షన్…
ఇక ఈ రేస్‌కు బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో సల్మాన్ ఖాన్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ప్రారంభంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో సన్నిహిత సంభాషణలో కనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీయింది. ఈ సన్నివేశం ముఖ్యమంత్రి స్వచ్ఛమైన ప్రజాసంబంధాల శైలిని, కొత్త యుగ క్రీడలను ప్రోత్సహిస్తోన్న దృక్పథాన్ని తెలియజేస్తుంది.
Honourable Chief Minister Sri A @revanth_anumula flags off the thrill and energy of Indian Supercross Racing League Season 2 at Gachibowli’s GMC Balayogi Stadium.
A high-octane evening with Minister Sridhar Babu and Bollywood superstar @BeingSalmanKhan adding to the… pic.twitter.com/E8e6ZENjE7
— Jacob Ross (@JacobBhoompag) December 6, 2025