Dzire 2026 Model: భారతదేశంలో Maruthi Suzuki కార్లకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఒక వినియోగదారుడికి అవసరమైన అన్ని ఫీచర్లను అందించి సరసమైన ధరలకు ఈ కార్లను విక్రయిస్తూ ఉంటారు. అయితే వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్ మారుస్తూ కొత్త కొత్త కారులను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన Dzire ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు కాంపాక్ట్ సడన్ విభాగంలో ఇదే కారు అప్గ్రేడ్ తో మార్కెట్లోకి వచ్చింది. ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు.. ధర తక్కువగా ఉండడంతో చాలామంది ఈ కారు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ కారు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Maruthi Suzuki నుంచి అప్గ్రేడ్ అయిన Dzire 2026 ప్రస్తుతం మార్కెట్లో ఉంది. ఈ కారు 1.2 లీటర్ Z సిరీస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ను కలిగి ఉంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పనిచేసే ఇది 89 HP, 113 NM టార్క్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ పై లీటర్ ఇంధనానికి 32 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ ఇంజన్ నగరాలతో పాటు లాంగ్ డ్రైవ్ చేసేవారికి కూడా అనుగుణంగా ఉంటుంది.
అలాగే ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఆపిల్ కార్ ప్లే కు మద్దతు ఇచ్చే 9 అంగుళాల స్మార్ట్ డిస్ప్లే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో పనిచేస్తుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ తో పాటు లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఫీచర్లు ఉన్నాయి. EBD తో పాటు ABS టెక్నాలజీ కలిగిన ఇందులో రివర్ వ్యూ కెమెరా, కీ లెస్ ఎంట్రీ, పవర్ విండోస్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అమర్చారు.
Dzire 2026 ఆకట్టుకునే డిజైన్తో కనిపిస్తుంది. బోల్ట్ క్రోమ్ గ్రిల్, స్టైలిష్ అల్లాయి వీల్స్, ప్రీమియం సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, విలాసవంతమైన క్యాబిన్ ఆకర్షిస్తుంది. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్లు, ఎర్గోనోమిక్ గా రూపొందించిన సీట్లు లాంగ్ డ్రైవ్ చేసినా అలసట లేకుండా ఉంటాయి. వినియోగదారుడి సౌలభ్యం కోసం ఆప్టిమైజ్ డిజైన్ చేయబడ్డాయి. ఈ కారు ధర రూ.2.49 లక్షలకే అందుబాటులో ఉంది. అత్యంత సరసమైన హైబ్రిడ్ సెడాన్ కార్లలో ఇది ఒకటిగా నిలిచింది. కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా స్మార్ట్, ఇంధన సామర్థ్యాన్ని కలిగిన ఈ కారు అధిక మైలేజ్ తో పాటు ఆధునిక లక్షణాలు కలిగి ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు ఉన్న డిజైర్ కంటే ఇది అప్గ్రేడ్ ఫీచర్లను కలిగి ప్రత్యేక కారుగా నిలుస్తుంది..