CM Relief Fund: ఆపదలో ఉన్నప్పుడు.. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ పేరుతో ఆర్థిక సహాయం చేస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ కారణాలవల్ల ఆసుపత్రుల పాలైనవారు.. చికిత్స చేయించుకున్న తర్వాత ప్రభుత్వ సహాయం కోసం సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తులను పరిశీలించి.. వైద్య ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా అంచనావేసి.. ప్రభుత్వం తన తరఫున ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటుంది. అయితే ఎంతో గొప్ప లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకంలో కొందరు పందికొక్కులు ప్రవేశించారు. ఫలితంగా ఈ పథకం లక్ష్యాన్ని పక్కదారి పట్టించారు. ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బులను సొంతానికి వాడుకొని.. లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టారు.
Also Read: తీట ఫ్రెండ్స్: తీన్మార్ మల్లన్నలో ఈ యాంగిల్ చూడలేదే!
సూర్యాపేట జిల్లా కోదాడలో సీఎం అఫ్ చెక్కుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణాన్ని సిసిఎస్ పోలీసులు చేదించారు. చెక్కుల కుంభకోణంలో ఆరుగురు సభ్యులున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి కోదాడ పట్టణ పరిధిలో పలువురికి 44 చెక్కులు మంజూరు కాగా.. అందులో 38 చెక్కులను ఈ ముఠా విత్ డ్రా చేసింది.మరో ఆరు చెక్కులను డ్రా చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఏకంగా తొమ్మిది లక్షల నగదు.. 6 స్మార్ట్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: రేవంత్ బీహార్ వెళ్లి కాంగ్రెస్ ను ముంచాడా?
కోదాడ పట్టణంలో పలువురు రాజకీయ నాయకులు ఈ చెక్కులను కాజేయడానికి ఒక ముఠాగా ఏర్పడ్డారు. సీఎంఆర్ పథకానికి అప్లై చేసుకున్న లబ్ధిదారుల వివరాలను తమకు అనుకూలంగా వీరు మార్చేసేవారు. ఆ తర్వాత ఆ డబ్బులను వేరే ఖాతాలోకి మళ్లించేవారు. కొంతకాలంగా ఈ ముఠా ఈ దంతాను దర్జాగా కొనసాగిస్తుంది. సిఎంఆర్ఎఫ్ చెక్కులు సంబంధిత ప్రజా ప్రతినిధి కార్యాలయానికి రావడమే ఆలస్యం.. ఆ చెక్కులను పంపిణీ చేస్తామని మీరు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ చెక్కులను దరఖాస్తు చేసుకున్న వ్యక్తిని కాదని.. అతడి ఇంటి పేరుకు దగ్గరగా ఉండే వ్యక్తుల ఖాతాకు నగదు బదిలీ చేస్తారు. బ్యాంకు ఖాతా నెంబర్ పూర్తిగా మార్చేసి అసలు వ్యక్తి ఖాతాలో కాకుండా.. తమ ముఠాలో ఉన్న వ్యక్తి ఖాతాలోకి డబ్బులను బదిలీ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ డబ్బులు విత్ డ్రా చేసుకొని వాటాలు వేసుకొని పంచుకుంటున్నారు. ఇటీవల ఓ లబ్ధిదారుడికి చెక్కు మంజూరైన.. అతడికి ఇవ్వలేదు. ఈ విషయాన్ని అతడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.