Charlapalli Railway Station: హైదరాబాద్ రైల్వే స్టేషన్లు అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేవి నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ మాత్రమే. కానీ ఇప్పుడు మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల ఇబ్బందులు తీర్చేందుకు హైదరాబాద్‌లోని మూడు ప్రధాన రైల్వే స్లేషన్లపై భారం తగ్గించేందుకు నగర శివారులో చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మించారు. ఎయిర్‌పోర్టు తరహాలో ఈ స్టేషన్‌ను అప్‌గేడ్ చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తోంది రైల్వే శాఖ.
హైదరాబాద్ నగరానికి మణిహారంగా భావిస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్ మరికొన్ని గంటల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిర్మించారు. ఇప్పటికే ఇందులో రైళ్లనునిలుపుతున్నారు. ఇక్కడి నుంచే పలు రైళ్లు బైయలుదేరేలా రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. సనత్‌నగర్–మౌలాలి మధ్య రెండో లైన్ సిద్ధమవడంతో నగరం మీదుగా వెళ్లనున్న ట్రైన్లను బైపాస్ చేయడానికి ఈ స్టేషన్‌తో వీలు ఏర్పడింది.
రూ.430 కోట్ల అంచనాతో..
చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను రూ.430 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ గతంలో రెండు ప్లాట్‌ఫాంలు, మూడు రైల్వే లైన్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు దానిని 9 ప్లాట్‌ఫామ్‌లు నిర్మించారు. 12 మీటర్ల వెడల్పుతో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. 6 మీటర్ల వెడల్పుతో మరొకని నిర్మించారు. తొమ్మిది ప్లాట్‌ఫాంలలో ఎస్కలేటర్లు, లిఫ్టులు ఉన్నాయి. మొత్తం ఏడు లిఫ్టులు, ఆరు ఎస్కలేటర్లు ప్రయాణికులకు అందుబబాటులో ఉంటాయి. కోచ్ నిర్వహణ వ్యవస్థతోపాటు ఎంఎటీఎస్ రైళ్లకు ఎలాంటి ఆటంకం లేకుండా రెండు ప్లాట్‌ఫామ్‌లు నిర్మించారు. ఇక స్టేషన్ బయట బస్‌బేలు, ప్రవేశమార్గాలు, పార్కింగ్ స్థలం ఏర్పాటుచేశారు.
ఈ స్టేషన్లపై తగ్గనున్న ఒత్తిడి..
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హైదరాబాద్ మహానగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తడి పెరుగుతోంది. చర్లపల్లి రైల్వే టర్మినల్ నిర్మాణంతో ఈ స్టేషన్లపై ఇప్పుడు ఒత్తిడి తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధి చేశారు. ఈ స్టేషన్ నుంచి 24 రైళ్లు నిత్యం రాకపోకలు సాగించనున్నాయి. ఈ కొత్త టెర్మినల్ గూడ్స్ రైళ్లకు కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా గూడ్స్ రైళ్లు ఇక్కడి నుంచి నడవనున్నాయి. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో 19 ట్రాక్స్ ఉన్నాయి. దీంతో ఈ టెర్మినల్ చాలా పెద్దగా ఉంటుంది.
నేడు ప్రారంభం..
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం(జనవరి 6న) వచ్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఈ రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పాల్గొంటారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Charlapally railway station with nine platforms and modern facilities will open on january 6
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com