HomeతెలంగాణBRS BJP Strategy: అసలు బీజేపీపై బీఆర్ఎస్ ఎందుకు పోరాడడం లేదు.. కారణమేంటి..?

BRS BJP Strategy: అసలు బీజేపీపై బీఆర్ఎస్ ఎందుకు పోరాడడం లేదు.. కారణమేంటి..?

BRS BJP Strategy: తెలంగాణ రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాబోయే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనేనని, కాంగ్రెస్‌తో పోటీ లేదని, తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ శ్రేణులు చేస్తున్న కార్యకలాపాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి.

చెప్పేది ఒకటి.. చేసేది ఇంకోటి..
కేటీఆర్‌ చెప్పినట్లు బీజేపీని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే, ఆ పార్టీ విధానాలు, నిర్ణయాలపై నిరంతర విమర్శలు, ప్రచారం జరగాలి. కానీ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేస్తున్న సమావేశాలు, నిరసనలు, ప్రచారాలు అన్నీ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీని నేరుగా ఎదుర్కొనే ప్రయత్నాలు ఇప్పటికీ కనిపించడం లేదు.

గతంలోని బీజేపీ వ్యతిరేకత..
కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఢిల్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై గట్టి వ్యతిరేకత వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపాలని పార్టీ పేరును కూడా టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌గా మార్చారు. అయితే ఆ తర్వాత ఆ వైఖరి హఠాత్తుగా మారిపోయినట్లు కనిపిస్తోంది. కేంద్ర పెద్దలపై లేదా బీజేపీ విధానాలపై గట్టి విమర్శలు చేసిన సందర్భాలు ఇటీవలి కాలంలో చాలా తక్కువగా ఉన్నాయి.

ఈ కొత్త రాగం వెనుక రాజకీయ వ్యూహం..
కేటీఆర్‌ ఇప్పుడు చెబుతున్న మాటల వెనుక రెండు ప్రధాన ఉద్దేశాలు ఉండవచ్చు. ఒకటి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను బీజేపీ వైపు వెళ్లకుండా బీఆర్‌ఎస్‌వైపు మరల్చి, ఆ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడం. రెండు, తమ కేడర్‌లో నైరాశ్యం తగ్గించి, తాము ఇంకా రేసులో ఉన్నామని, కాంగ్రెస్‌ మూడో స్థానానికి పడిపోతుందని చెప్పి జోష్‌ నింపడం.

మాటలు కాదు.. చేతలు కావాలి…
కేవలం ప్రెస్‌ మీట్లలో ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం వల్ల ప్రజల్లో నమ్మకం కలగదు. బీఆర్‌ఎస్‌ నిజంగా బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తే, రాబోయే బస్సు యాత్రలు, పాదయాత్రల్లో కేవలం రాష్ట్ర సమస్యలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా గట్టిగా మాట్లాడాలి. అలా చేస్తేనే ఈ ప్రకటనలకు విలువ ఏర్పడుతుంది.

గత అనుభవాలు గుర్తుంచుకున్న ఓటర్లు తెరవెనుక ఒకటి, తెరపై మరొకటి చేస్తే సులభంగా నమ్మరు. బీఆర్‌ఎస్‌ నిజంగా బీజేపీపై పోరాడాలనుకుంటే, ఆ దిశగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలి. అప్పుడే కేటీఆర్‌ ఆశించినట్లు క్షేత్రస్థాయిలో కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version