HomeతెలంగాణBRS Merges BJP: కవిత వద్దనుకున్న డిమాండ్.. కేటీఆర్ నెరవేర్చబోతున్నాడా?

BRS Merges BJP: కవిత వద్దనుకున్న డిమాండ్.. కేటీఆర్ నెరవేర్చబోతున్నాడా?

BRS Merges BJP: బండి సంజయ్, కేటీఆర్ యాదృచ్ఛికంగానే కలిసి ఉండవచ్చు.. వరద బాధితులను కాపాడాలనే కృత నిశ్చయం వారిద్దరిలోనూ ఉండవచ్చు. అన్నింటికంటే ఎక్కువగా వరదల్లో ఈ బురద రాజకీయం ఎందుకంటూ ఇద్దరు ఒక మెట్టు దిగి ఉండవచ్చు. అంతమాత్రాన అది అక్కడితోనే ఆగిపోదు. ఇప్పుడు అసలే సోషల్ మీడియా కాలం.. చీమ చిట్టుకు మన్నా సరే రకరకాల ప్రచారాలు.. రకరకాల ఊహగానాలు తెరపైకి వస్తాయి. ఆ తర్వాత జరగాల్సిన పని జరిగిపోతూ ఉంటుంది. దానివల్ల సమాజానికి ఉపయోగం ఉంటుందా.. లేదా.. అనే విషయాలను పక్కన పెడితే జరగాల్సిన చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక రకమైన చర్చ నడుస్తోంది.

Also Read: తారుమారైన బిగ్ బాస్ 9 ‘అగ్నిపరీక్ష’ ఓటింగ్..ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ అవుట్?

బండి సంజయ్, కేటీఆర్ పరస్పరం తారసపడ్డారు కాబట్టి.. ఇదేది యాదృచ్ఛికమైన కలయిక కాదు. వారిద్దరూ అనుకోని కలిశారు. వారిద్దరు మాత్రమే కాదు కమలం, కారు కూడా త్వరలో కలిసిపోతున్నాయి. 2028 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇదే జరుగుతుంది.. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. అందువల్లే బిజెపి నాయకులు గులాబీ నాయకుల మీద.. గులాబీ నాయకులు బిజెపి నాయకుల మీద విమర్శలు చేయడం లేదని రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని.. ఈ తరహా విశ్లేషణలకైతే అడ్డు అదుపు లేకుండా పోతోంది. వీటిని అటు బిజెపి నాయకులు గాని.. ఇటు గులాబీ పార్టీ నాయకులు గాని ఖండించడం లేదు.. దీంతో వీటి వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు.

కేటీఆర్ నెరవేర్చబోతున్నారా

ఇటీవల జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత పలుమార్లు మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రైవేట్ న్యూస్ చానల్స్ లో ముఖాముఖిగా మాట్లాడారు. ఇందులో కారు, కమలం దోస్తీకి సంబంధించిన చర్చ వచ్చింది. గతంలో తాను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన వచ్చిందని.. దానిని తను అడ్డుకున్నట్టు కవిత ప్రకటించారు. అయితే ఇప్పుడు కవితకు, కల్వకుంట్ల తారక రామారావుకు రాజకీయంగా విభేదాలు ఏర్పడ్డాయి. ఈ అన్నాచెల్లెళ్ల మధ్య అగాధం పూడ్చలేని స్థాయికి చేరుకుంది. దీంతో ఎవరి రాజకీయ భవిష్యత్తును వారు వెతుక్కుంటూ ప్రయాణం సాగిస్తున్నారు.. నాడు కవిత తిరస్కరించింది కాబట్టి.. ఇప్పుడు కమలంతో దోస్తీని తాను నెరవేర్చబోతానని కేటీఆర్ భావిస్తున్నట్టు.. అందులో భాగంగానే కమలం పార్టీతో కలిసిపోతున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి.. అయితే ఇందులో ఇంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. కవిత మాట్లాడిన మాటలకు కేటీఆర్ చేస్తున్న చేష్టలు వ్యతిరేకంగానే ఉన్నాయి. రోజులు గడిస్తే గాని ఇటువంటి విషయాలపై క్లారిటీ రాదు.. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలలో శాశ్వతమైన మిత్రులు ఉండరు. అలాగే శాశ్వతమైన శత్రువులు కూడా ఉండరు. స్థూలంగా చెప్పాలంటే రాజకీయం అనేది ఒక వైకుంఠపాళీ లాంటిది. ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారు అడుగులు వేస్తుంటారు. ఆ అడుగులను వారు సుస్థిరం చేసుకుంటారు. దీనికోసం ఎంతకైనా తెగిస్తారు. ఎక్కడదాకయినా వెళ్తారు. ఇందులో బిజెపి ప్రథమం కాదు. భారత రాష్ట్ర సమితి చివరిది కాదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version