Boyfriend Married Someone: ప్రేమించాడు. మోహించాడు. కామించాడు. సరదాలు తీర్చుకున్నాడు. పెళ్లంటేనే ముఖం చాటేశాడు. అవసరానికి వాడుకుని అవసరం తీరాక పడేసే వస్తువులాగా భావించాడు. యువతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నా అమ్మాయిలు మాత్రం గుడ్డిగా నమ్ముతూ నట్టేట మునుగుతున్నారు. పుష్కర కాలంగా ప్రేమిస్తున్నానని వెంట తిరిగాడు. తనను కూడా తిప్పుకున్నాడు. సినిమాలు, షికార్లు, పబ్బులు, క్లబ్బులు ఒకటేమిటి వారి జంట తిరగని చోటు లేదు. వెళ్లని స్థలం లేదు. ఇంత కాలం తిరిగినా చివరకు మాత్రం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాండిచ్చాడు దీంతో ఆ యువతి లబోదిబోమంటోంది. ఇక నాకు దిక్కెవరని బోరున విలపిస్తోంది. తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది.

హైదరాబాద్ లోని హబ్సీగూడ ప్రాంతంలోని వెంటకరెడ్డి నగర్ లో శ్రీకాంత చారి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఉండే లక్ష్మి అతడిని ప్రేమించింది. పన్నెండేళ్లుగా వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ ప్రాంతంలోని వారంతా వారు పెళ్లి చేసుకునే వారే కదా అని అనుకునేవారు. ఇక్కడో అతడు ఓ ట్విస్ట్ ఇచ్చాడు. తనను పెళ్లి చేసకోవాలని అడిగిన లక్ష్మికి ఓ పసుపు తాడు తగిలించాడు. ఇక మన పెళ్లయిందని నమ్మించాడు. కానీ చివరకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని అత్తారింటికి చెక్కేశాడు. విషయం తెలియడంతో లక్ష్మి తట్టుకోలేకపోయింది.
Also Read: Ponnur Politics: కిలారి వర్సెస్ ‘రావి’+టీడీపీ.. పొన్నూరులో వైసీపీ పతనానికి పక్కా ప్లాన్
ఇన్నేళ్లు కలిసి తిరిగిన లక్ష్మిని కాదని వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడం చర్చనీయాంశం అయింది. చేసిన బాసలు.. చెప్పుకున్న ఊసులు అన్ని ఉత్తవే అని కొట్టిపారేశాడు. దేని కోసం ఇంత దారుణం చేశాడనే కోణంలో లక్ష్మి ఆరా తీసినా లాభం లేకుండా పోయింది. జరగాల్సిన నష్టం జరిగే పోయింది. పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు లక్ష్మికి ఏం సమాధానం చెబుతాడు. కేవలం దళితురాలైనందుకే తనను పెళ్లి చేసుకోకుండా ఇలా చేస్తున్నాడని లక్ష్మి ఆరోపిస్తోంది. అతడిని చట్టపరంగా శిక్షించే వరకు వదిలేదని చెబుతోంది.
లక్ష్మి ఆ ఏరియాలో అందరికి సుపరిచితురాలే కావడంతో అందరి సహకారం లభిస్తోంది. మహిళా సంఘాలు కూడా ఆమెకు అండగా నిలిచాయి. శ్రీకాంత చారిని శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. విషయం తేలే వరకు ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు. శ్రీకాంత చారి లాంటి వ్యక్తులు ఇంకా ఎందరి జీవితాలతో ఆడుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఆడాన్ని మోసం చేసి బతికి బట్టకట్టిన మగవాడు లేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని తెగేసి చెబుతున్నారు. పోలీసులు దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో తెలియడం లేదు.
Also Read: Star Hero Missed Aadi Movie: షాకింగ్.. ఆది సినిమాని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?
Recommended Videos: