https://oktelugu.com/

Paidi Rakesh Reddy : 2 ఎకరాలు టు 2వేల కోట్లు.. చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పుష్ప2 చిత్రానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చాయి. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోల ప్రదర్శనకు వెసులుబాటు కల్పించాయి. ఈ తరుణంలోనే కొన్ని రకాల రాజకీయ విమర్శలు చుట్టుముడుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : December 4, 2024 / 01:33 PM IST

    BJP mla Comments on AP CM Chandrababu's Assets

    Follow us on

    Paidi Rakesh Reddy : ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారు.ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన ఎంపీ సీట్లను ఇచ్చారు. అందుకే జాతీయస్థాయిలో చంద్రబాబు పరపతి అమాంతం పెరిగింది.బిజెపి అగ్రనేతలు ఎనలేని గౌరవం ఇస్తున్నారు.ఏపీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు.నిధులతో పాటు ప్రాజెక్టుల కేటాయింపులో కూడా సింహభాగం ఏపీకి అందిస్తున్నారు.జాతీయస్థాయిలో అంతటి గౌరవాన్ని అందుకుంటున్న చంద్రబాబుపై తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఆస్తులపై మాట్లాడి విపక్షాలకు విమర్శనాస్త్రాలు అందించారు.ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    * యువత పెడదోవ
    ప్రస్తుతం పుష్ప 2చిత్రం హడావిడి నడుస్తోంది. సోషల్ మీడియాను ఆ సినిమా షేక్ చేస్తోంది. రేపు ప్రపంచవ్యాప్తంగా ఆచిత్రం విడుదల కానుంది. ఈ తరుణంలో ఆ చిత్రానికి సంబంధించి టికెట్ ధరల పెంపు, ప్రత్యేక అనుమతులు జారీచేసింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణలో సైతం రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలో బిజెపి నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపికి చెందిన ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాను రిలీజ్ చేయవద్దు అంటూ డిమాండ్ చేశారు.పుష్ప సినిమాలో చూపించింది అంతా అబద్ధం అని చెప్పుకొచ్చారు.ఎర్రచందనం ధర పది లక్షలు ఉంటే కోటి రూపాయలుగా చూపించిన విషయాన్ని చెప్పుకొచ్చారు రాకేష్ రెడ్డి.ఆ సినిమాతో యువత పెడదోవపట్టారని ఆరోపించారు.పుష్ప సినిమా వచ్చినప్పుడు లక్షలాది చెట్లను నరికి వేశారని.. ఇప్పుడు పుష్ప 2 తో మరిన్ని చెట్లు నరికి వేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన.

    * ఒక్కసారిగా చంద్రబాబు పై ఫైర్
    పుష్ప 2 సినిమాకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి.చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఒక్కసారిగాచంద్రబాబు ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు వాళ్ళ అయ్యకు రెండు ఎకరాల ఆస్తి ఉండేది.ఇప్పుడు ఆయనకు వేలాది ఎకరాల హెరిటేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రశ్నించారు.అయితే ఒక్కసారిగా బీజేపీ ఎమ్మెల్యే అలా ఫైర్ అయ్యేసరికి సోషల్ మీడియాలో వైరల్ అంశం గా మారింది. ఆయన ఎందుకు ఇంతటి సంచలన వ్యాఖ్యలు చేశారో ఎవరికీ అంతుపట్టడం లేదు.