Alleti Maheshwar Reddy: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల కాలం నడుస్తోంది. పార్లమెంటు ఎన్నికల వేళ చాలా మంది తమకు కలిసివచ్చే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌కు చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు, సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీలో ఇప్పటికే చేరారు. మరికొందరు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ‘బీఆర్ఎస్ పని ఖతం అయింది.. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వస్తారు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీబీజేపీలో పెద్ద దుమారమే లేపాయి. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ శాసన సభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక రకంగా కాంగ్రెస్ సర్కార్‌కు వార్నింగే ఇచ్చారు.
టచ్ చేస్తే కూల్చేస్తాం..
నేతల వలసలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఖాళీ అవుతాయన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 12 మంద ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్నారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ మారే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ మొదలైంది. బీజేపీ మొత్తం కాంగ్రెస్‌లో మెర్జ్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై బీజేఎలీ‍్ప నేత మహేశ‍్వర్‌రెడ్డి స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కోమటిరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సొంత తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి భార్యకే ఎంపీ టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
తెలంగాణ షిండే కోమటిరెడ్డి..
అంతటితో ఆగకుండా తెలంగాణలో మరో షిండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవుతారని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈమేరకు ఆయన కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ముందు ఒప్పుకున్నారని తెలిపారు. కానీ, బీజేపీ అధిష్టానం కోమటిరెడ్డిని నమ్మడం లేదని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహసం చేయొద్దన్నారు. అదే జరిగితే కాంగ్రెస్‌లోని 60 మందిని 48 గంటల్లో లాగేస్తామని హెచ్చరించారు. ప్రజా తీర్పును గౌరవించి తాము పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఈటల కౌంటర్..
బీజేపీ నేత ఈటల రాజేంద కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం పెద్ద పని కాదన్నారు. తలుచుకుంటే 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లోకి వస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు అధికారం కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలకు హద్దులు లేకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌నే అనుసరిస్తున్నారని విమర్శించారు. డబ్బుతో నాయకులను, కార్యకర్తలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Bjp leader eleti maheshwar reddy got fired up over minister komatireddy comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com