BRS vs BJP : తెలుగులో ఇప్పుడు ఏ వెబ్ సైట్ చూసినా.. ఫోన్లో ఏదీ ఓపెన్ చేసినా కూడా ఒక ప్రముఖ యాడ్ మనకు కనిపిస్తోంది. అదే ‘సాలు దొర-సెలవు దొర’. ఇదే కాదు.. టీవీ ఆన్ చేసినా.. యూట్యూబ్ వెతికినా కూడా ఇదే యాడ్ మనకు వస్తోంది. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 100 కోట్లు ఈ డిజిటల్ ప్రచారానికి వాడేశాడని ఆ మధ్యన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఆరోపించారు. పార్టీ డబ్బులను తన సొంతానికి ఇలా ఖర్చు చేయడం ఏంటని ఆయన అన్నాడు.

కట్ చేస్తే.. ఈ ప్రచార హోరు ఎక్కువైపోయి అధికార బీఆర్ఎస్ కు ఇప్పుడు గుదిబండలా తయారైంది. ఏ టీవీ, సోషల్ మీడియా, వెబ్ సైట్ ఓపెన్ చేసినా కేసీఆర్ ను ఇరుకునపెట్టేలా ‘సాలు దొర’ యాడ్ కనిపిస్తోంది. ఈటల రాజేందర్ దగ్గరుండి మరీ ఈ బీజేపీ డిజిటల్ క్యాంపెయిన్ ను రన్ చేస్తున్నాడట.. కేసీఆర్ పంటిలో రాయిలా ఇది తగులుతోందట..
దీంతో చిర్రెత్తుకొచ్చిన బీఆర్ఎస్ బ్యాచ్ ఎట్టకేలకు ప్రచార హోరుకు తెరలేపింది. ఎక్కడైతే బీజేపీ అడ్వటైజ్ మెంట్లు ఇస్తుందో గుర్తించేసి అన్ని చోట్ల కేసీఆర్ యాడ్ లు ఇస్తోంది. కేసీఆర్ తెలంగాణకు చేసిన అభివృద్ధిని హైలెట్ చేస్తూ ఈ ప్రకటన ఇస్తోంది.
దీంతో ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా.. కంప్యూటర్ తెరిచినా.. టీవీల్లో చూసినా.. ఆఖరుకు రోడ్డుపై చూస్తున్నా కేసీఆర్ ప్రభుత్వ ప్రచార ప్రకటనలే కనిపిస్తున్నాయి. లేట్ అయినా లేటెస్ట్ గా కేసీఆర్ బ్యాచ్ ఈ ప్రకటనల రంగంలోకి దిగిపోయింది. బీజేపీకి ధీటుగా ఈ ప్రకటనలు ఇస్తోంది.