https://oktelugu.com/

Barrelakka: రాంగోపాల్ వర్మ పై సంచలన ఫిర్యాదు చేసిన బర్రెలక్క

తెలంగాణలో ఓటమి చవిచూసిన బర్రెలక్క ఏపీలో మాత్రం హాట్ టాపిక్ గా మారారు. ఆమెను చూపి పవన్ కళ్యాణ్ వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 29, 2023 / 11:01 AM IST

    Barrelakka

    Follow us on

    Barrelakka: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు.సినిమాలతోనే కాక వివాదాస్పద వ్యాఖ్యలతో రామ్ గోపాల్ వర్మ నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా వ్యూహం సినిమా విషయంలో ఆయన అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ సినిమా విడుదల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో ఆర్జీవి మరో వివాదంలో చిక్కుకోవడం విశేషం. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ చేసిన సంగతి తెలిసిందే. కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ప్రధాన రాజకీయ పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ప్రచారం చేశారు. యువత అభిమానాన్ని చేరుకున్నారు. ఓడిపోయినప్పటికీ రాజకీయాల్లో మాత్రం చర్చనీయాంశంగా మారారు.

    తెలంగాణలో ఓటమి చవిచూసిన బర్రెలక్క ఏపీలో మాత్రం హాట్ టాపిక్ గా మారారు. ఆమెను చూపి పవన్ కళ్యాణ్ వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు రాలేదంటూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా వ్యూహం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బర్రెలక్క పై రామ్ గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బర్రెలు కాచుకునే.. ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది. బర్రె లెక్క కాస్త ఉంటుంది. బర్రెలు ఆమె మాట వింటున్నాయి. అటువంటిది పవన్ కళ్యాణ్ మాటలను ఎవరు నమ్మలేదు అంటూ వ్యాఖ్యానించారు. పవన్ ను విమర్శించేందుకు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు సరికాదని ఈ సందర్భంగా బర్రెలక్క తరపు న్యాయవాది పేర్కొన్నారు.

    మహిళా కమిషన్ ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఆర్జీవి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మ నువ్వు బతకాలి అనుకుంటే బ్లూఫిలిమ్స్ తీసుకుని బతుకు. కానీ మా ప్రాంత బిడ్డలు ఎదగాలి అనుకుని ప్రయత్నం చేస్తుంటే ఇలా చేయడం తప్పు అని ఆమె తరపు న్యాయవాది తప్పు పట్టారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమి కొడతామని వర్మను ఆయన హెచ్చరించారు. మొత్తానికైతే వ్యూహం సినిమా విడుదల కాకముందే పెను వివాదాలకు కారణమవుతోంది. ఎన్నో సంచలనాలను నమోదు చేస్తోంది. మరి ఆ చిత్రంవిడుదల తర్వాత ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.