Bandi Sanjay comments on Narender Reddy
Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో మంచి మైలేజీ.. ఫైర్ ఉన్న నేత బండి సంజయ్. యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. కరుడుగట్టిన హిందుత్వ వాది అయిన సంజయ్ ఎన్నికల సమయంలో దీనిని కచ్చితంగా ప్రస్తావిస్తారు. తాజాగా తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం చేసిన సంజయ్ ప్రచారం ముగింపునకు కొన్ని గంటల ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పాకిస్తాన్‌కు వేసినట్లే అన్నారు. బీజేపీకి వేస్తే భారత్‌కు వేసినట్లు అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌తో పోల్చారు. బీజేపీ భారత జట్టు అని, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ టీం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎన్నికల నిబంధన ఉల్లంఘనే అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
పట్టు నిలుపుకునేందుకేనా..
కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈక్రమంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. అందుకే స్వయంగా ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. పట్టభద్రుల స్థానానికి కరీనంగర్‌కే చెందిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సంజయ్. ఈ క్రమంలోనే ప్రచారం ముగింపు సమయానికి కొన్ని గంటల ముంద.. నరేదర్‌రెడ్డి పేరుప్రస్తావించకుండా కాంగ్రెస్‌ను పాకిస్తాన్‌తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేతల ఆగ్రహం..
బండి సంజయ్ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సంజయ్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రాజకీయాలను క్రికెట్‌తో ముడిపెట్టడం సంజయ్‌కి సరికాదన్నారు. మంత్రి సీతక్క కూడా బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేశాలను రగిల్చేలా సంజయ్ మాట్లాడుతునా‍్నరని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోవాలని పలువురు ఈసీని కోరుతున్నారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు ఒక కేంద్ర మంత్రి అన్న విషయాన్ని మరిచిపోయి ఈ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతారా అని మండిపడ్డారు. బండి సంజయ్ మాట్లాడిన మాటలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం తప్పు అన్నారు. తప్పకుండా సంజయ్‌పై కేసు ఫైల్ చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాకిస్తాన్‌కు ఓటు వేసినట్టే
ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది
బీజేపీ భారత్ టీం, కాంగ్రెస్ పాకిస్తాన్ టీం – బండి సంజయ్ pic.twitter.com/zGOs0IySx2
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2025
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Bandi sanjay made controversial remarks saying that voting for congress in mlc elections is like voting for pakistan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com