MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం నమోదైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం(మార్చి 15న) ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఉంచి వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు సుమారు నాలుగు గంటలపాటు కవిత ఇంట్లో సోదాలు చేశారు. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు.
ఉదయం నుంచి ఇలా..!
ఢిల్లీ లిక‍్కర్ కుంభకోణంలో 2022లో తొలిసారి కవిత పేరు బయటకు వచ్చింది. తొలుత ఆమెను సాక్షిగా పేర్కొన్న ఈడీ, తర్వాత సౌత్ గ్రూపు మొత్తాన్ని కవితే నడిపించినట్లు పలు చార్జిషీట్లలో అభియోగాలు మోపింది. తర్వాత నిందితురాలిగా చేర్చి రెండుసార్లు ఢిల్లీలో విచారణ చేసింది. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో తర్వాత కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినా విచారణకు వెళ్లలేదు. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో శుక్రవారం కేసు విచారణ అనంతరం ఈడీ, ఐటీ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో కవితను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని మధ్యాహ్నం నుంచే ప్రచారం జరుగుతోంది. కవిత ఇంట్లో అధికారుల సోదాలు.. ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించడంతోనే ఏదో కీలక పరిణామం తప్పదని భావించారు.
16 ఫోన్టు స్వాధీనం..
మరోవైపు అధికారులు వచ్చిన సమయంలో కవిత, ఆమె భర్త ఇంట్లోనే ఉన్నారు. దీంతో అధికారులు కవితతోపాటు, ఆమె భర్తకు సంబంధించిన ఫోన్లు, పీఏలో ఫోన్లు, సిబ్బంది ఫోన్లు మొత్తం 16 సా‍్వధీనం చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అయితే కవిత పిటిషన్‌పై విచారణ మార్చి 19న ఉండడంతో అంతరవకు ఎలాంటి చర్యలు ఉండవని బీఆర్‌ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. సుదీర్ఘ తనిఖీల తర్వాత నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.
8:45 ఫ్లైట్‌లో ఢిల్లీకి..
ఇక కవితను అరెస్టు చేసనట్లు ఈడీ అధికారులు ధ్రువీకరించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రాత్రి 8:45 గంటల ఫ్లైట్‌లో కవితను ఢిల్లీకి తరలిస్తామని తెలిపారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, బాల్క సుమన్ తదితరులు కవిత ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్పటికే బీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడకు చేరుకుని ఈడీకి, మోదీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు.
ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం..
కవిత అరెస్టుపై కేటీఆర్, హరీశ్‌రావు ఈడీ అధికరులతో వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. కనీం తమ న్యాయవాదిని అయనా అనుమతించాలని డిమాండ్ చేశారు. అధికారులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ కేటీఆర్ మాత్రం మహిళల అరెస్టుకు సబంధించిన ఉదాహరణలు చెబుతూ ఈడీ అధికారులతో వాదనకు దిగారు.