KTR son post goes viral: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటింది. సజాబుగానే పాలన సాగుతోంది. అయితే విపక్షాలు ఎన్నికల షమయంలో ఇచ్చిన హామీలపై అధికార పార్టీని నిలదీస్తున్నాయి. ఇక రేవంత్‌రెడ్డి కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన సమయంలో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీస్తున్నారు. తాజాగా సింగరేణి బొగ్గు గని టెండర్ల విషయం ప్రభుత్వానికి నెగెటివ్‌గా మారడంతో ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి తెచ్చారు. హరీశ్‌రావు, కేటీఆర్‌కు సిట్‌తో నోటీసులు ఇచ్చి విచారణ చేయించారు. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ సమయం కోరడంతోపాటు ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలని లేఖ రాశారు. కానీ, సిట్ కేసీఆర్ రిక్వెస్ట్‌ను తిరస్కరించింది. హైదరాబాద్ నందనగర్‌లో విచారణకు ఆదివారం(ఫిబ్రవరి 1న) సిద్ధంగా ఉండాలని మళ్లీ నోటీసులు పంపింది. ఈ క్రమంలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేయిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని కేసీఆర్ మనుమడు, కేటీఆర్ తనయుడు హిమాన్షు ఫేజ్‌బుక్‌లో పోస్టు చేశాడు.
ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేయిస్తున్న కేసీఆర్..
హిమాన్షు పోస్టు చేసిన పొటోలో కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేయిస్తున్నారు. ఈ చిత్రం రాజకీయ ఒత్తిడుల మధ్య ఆయన స్వచ్ఛంద స్థితిని ప్రతిబింబిస్తోంది. హిమాన్షు ఈ ఫొటోతోపాటు ‘ఆ గుండెకు మట్టి తాకితే నాకు సంతృప్తి.. మూలాలను మరువని మహానీయుడు కేసీఆర్’ అంటూ రాసిన క్యాప్షన్ ఎమోషనల్ టచ్ ఇచ్చింది.
స్పందిస్తున్న నెటిజన్లు…
సిట్ దర్యాప్తు ఒత్తిడిలో ఈ పొటో బీఆర్‌ఎస్ మద్దతుదారులకు ఊరటనిచ్చింది. ఆయన గొర్రెలు, పొలాలతో అనుబంధాన్ని చాటుకున్న ఈ చిత్రం వైరల్ కావడంతో #KCRFarmer హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. నెటిజన్లు ఆయన సరళతను ప్రశంసిస్తూ మీమ్‌లు, కామెంట్లు పెడుతున్నారు.
సిట్ నోటీసులు రాజకీయ డైవర్షన్‌గా కనిపించిన సమయంలో తాజా కేసీఆర్ ఫొటో బీఆర్‌ఎస్ ఇమేజ్‌ను రీబ్రాండ్ చేస్తోంది. కేసీఆర్ రైతు మూలాలు, స్థిరత్వాన్ని హైలైట్ చేస్తూ సపోర్టర్లను ఏకం చేస్తుంది. ఇది కేవలం వ్యక్తిగత ఉత్సాహమా లేక రాజకీయ కౌంటర్‌గా వ్యూహాత్మకంగా రూపొందించినదా అనేది చర్చనీయాంశంగా మారింది.