https://oktelugu.com/

Allu Arjun Press Meet : Breaking News : సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై కాసేపట్లో అల్లు అర్జున్ సంచలన ప్రెస్ మీట్..నిజానిజాలు ఆధారాలతో సహా బయటకి రానున్నాయా?

అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అలా ఉంటే, అక్బరుద్దీన్ ఓవైసీ ఒక అడుగు ముందుకేసి, ఇంకా నీచమైన ఆరోపణలు చేసాడు. ఒక మహిళ తొక్కిసిలాట లో చనిపోయింది అని చెప్తే అల్లు అర్జున్ పోలీసులతో 'అయితే మన సినిమా సూపర్ హిట్' అన్నాడని ఆరోపించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 21, 2024 / 06:51 PM IST

    Allu Arjun Press Meet

    Follow us on

    Allu Arjun Press Meet :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ నేడు అసెంబ్లీ సాక్షిగా చేసిన సంచలన ఆరోపణలు సోషల్ మీడియా లో ఎలాంటి దుమారం రేపిందో మన అందరం చూస్తూనే ఉన్నాం. మీరు రావడం వల్ల తొక్కిసిలాట జరిగి ఒకరు చనిపోయారు అని చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తూ ఉన్నాడని, చివరికి అరెస్ట్ చేస్తామని చెప్తే వెళ్లాడని, బయటకి వెళ్లిన తర్వాత కూడా ఆయన కార్ రూఫ్ టాప్ మీద నిల్చొని అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లాడని, అసలు ఇతను మనిషేనా అంటూ అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అలా ఉంటే, అక్బరుద్దీన్ ఓవైసీ ఒక అడుగు ముందుకేసి, ఇంకా నీచమైన ఆరోపణలు చేసాడు. ఒక మహిళ తొక్కిసిలాట లో చనిపోయింది అని చెప్తే అల్లు అర్జున్ పోలీసులతో ‘అయితే మన సినిమా సూపర్ హిట్’ అన్నాడని ఆరోపించాడు.

    ఈ ఆరోపణలు మీడియా లో పెను దుమారం రేపాయి. అల్లు అర్జున్ పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇదే కనుక నిజమైతే, అల్లు అర్జున్ ని కచ్చితంగా శిక్షించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి హై కోర్టు లో నడుస్తున్న ఒక సెన్సెటివ్ కేసు పై ఇలా అసెంబ్లీ లో మాట్లాడడం అంటే మామూలు విషయం కాదని, అల్లు అర్జున్ కచ్చితంగా తప్పు చేసాడు కాబట్టే ఇంత ధైర్యం గా ముఖ్యమంత్రి మాట్లాడాడు అంటూ సోషల్ మీడియా లో చెప్పుకొస్తున్నారు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి ని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ఎత్తి చూపిస్తుంటే, జనాల మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడం కోసం అల్లు అర్జున్ ని ఒక్క పావుగా ఉపయోగించుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు.

    అయితే వీటి అన్నిటికి సమాధానం మరికాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. జరుగుతున్న వ్యవహారాలన్నిటిపై, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన చాలా ఘాటుగా స్పందించబోతున్నాడని టాక్. అంతే కాకుండా ఆరోజు రాత్రి ఏమి జరిగింది?, పోలీసులు అతనితో ఏమని మాట్లాడారు అనే వాటిపై కూడా ఆయన ఆధారాలతో సహా బయటపెట్టబోతున్నాడు. ఈ విషయం ఇప్పుడు చాలా సీరియస్ అయ్యింది. ఒక వేళ అల్లు అర్జున్ మాట్లాడిన మాటల్లో నిజాయితీ కనిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. లేదా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినవి జనాలకు కరెక్ట్ అనిపిస్తే ఇక అల్లు అర్జున్ కెరీర్ రిస్క్ లో పడినట్టే. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యమైతే అల్లు అర్జున్ కోర్టు కి వెళ్లి సీఎం పై కేసు కూడా వెయ్యొచ్చు. చూడాలి మరి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఏమి చెప్పబోతున్నాడు అనేది.