https://oktelugu.com/

Samantha vs Konda surekha : ‘మీ పనికిమాలిన రాజకీయాల్లోకి నన్ను లాగితే మర్యాదగా ఉండదు’ అంటూ మంత్రి కొండా సురేఖకు సమంత స్ట్రాంగ్ వార్నింగ్!

కొండా సురేఖ కామెంట్స్ పై కాసేపటి క్రితమే సమంత కూడా చాలా ఘాటుగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ 'గ్లామర్ రంగంలోకి ఒక అమ్మాయి వచ్చి పని చేస్తే మీకు ఇష్టమొచ్చినట్టు ఊహించుకుంటారు. ప్రేమలో పడడం, విడిపోవడం వంటివి జరిగినప్పుడు ఎన్నో మాటలు పడాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిని ఎదురుకొని పోరాడి నిలిచేందుకు చాలా ధైర్యం, బలం కావాలి.

Written By:
  • Vicky
  • , Updated On : October 2, 2024 / 09:21 PM IST

    Samantha vs Konda surekha

    Follow us on

    Samantha vs Konda surekha : తెలంగాణ రాష్ట్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నేడు నాగ చైతన్య,సమంత వైవాహిక జీవితం గురించి చేసిన కొన్ని నీచమైన కామెంట్స్ కి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ఏ స్థాయి నెగటివిటీ వ్యక్తం అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రజలను పాలించే స్థానంలో కూర్చున్న మంత్రులు ఇంతటి నీచమైన, హేయమైన కామెంట్స్ చేయడం ఇప్పటి వరకు దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా జరగలేదు. అందులోనూ ఒక స్త్రీ, పరస్త్రీ పై ఇలాంటి కామెంట్స్ ఎలా చేయగలిగింది అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజెన్స్.

    ఆమె మాట్లాడుతూ ‘కేటీఆర్ కి ఇండస్ట్రీ లో అనేక మంది హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నాయి. నాగ చైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం కూడా ఇతనే. అప్పట్లో అక్రమ నిర్మాణంగా ఉన్న నాగార్జున N కన్వెన్షన్ హాల్ ని కూల్చేయబోతుంటే, నాగార్జున కేటీఆర్ కి ఫోన్ చేసి ఆపాల్సిందిగా కోరాడు. అప్పుడు కేటీఆర్ కచ్చితంగా ఆపేస్తాను, కానీ దానికి బదులుగా సమంతని నా దగ్గరకు పంపించు అని అడిగాడు. సమంత అందుకు ఒప్పుకోలేదు, నాగార్జున ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేసాడు, కానీ ఆమె ఒప్పుకోకపోయేసరికి విడాకులు ఇవ్వమన్నారు. సమంత విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది’ అంటూ అత్యంత నీచమైన కామెంట్లు చేసింది కొండా సురేఖ. దీనికి అక్కినేని నాగార్జున కూడా ట్విట్టర్ ద్వారా చాలా ఘాటుగా స్పందించాడు. మంత్రి స్థానం లో కూర్చున్న ఒక స్త్రీ ఇలా అసత్యాలు మాట్లాడడం విచారకరం. తక్షణమే ఆమె తన మాటలను వెనక్కి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేసాడు నాగార్జున.

    అలాగే కొండా సురేఖ కామెంట్స్ పై కాసేపటి క్రితమే సమంత కూడా చాలా ఘాటుగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘గ్లామర్ రంగంలోకి ఒక అమ్మాయి వచ్చి పని చేస్తే మీకు ఇష్టమొచ్చినట్టు ఊహించుకుంటారు. ప్రేమలో పడడం, విడిపోవడం వంటివి జరిగినప్పుడు ఎన్నో మాటలు పడాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిని ఎదురుకొని పోరాడి నిలిచేందుకు చాలా ధైర్యం, బలం కావాలి. ఈరోజు నేను అవన్నీ ఎదురుకున్నాను. కొండా సురేఖ గారు నా కెరీర్ లో నేను ప్రయాణించిన తీరుకు ఎంతో గర్వ పడుతున్నాను. దానిని ఒక మినిస్టర్ స్థానం లో కూర్చున్న మీరు, అత్యంత నీచంగా మాట్లాడడం చాలా బాధని కలిగించింది. ప్రతీ ఒక్కరికి గౌరవమైన వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. నా విడాకుల వ్యవహారం నా వ్యక్తిగతం, దానిపై లేని బండలు వేయడం సరికాదు. నా విడాకులు ఇరువురి మధ్య పరస్పర అంగీకారంతో, చాలా గౌరవప్రదంగా జరిగింది, అందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు. దయచేసి మీ నీచపు రాజకీయాల్లోకి నన్ను లాగకండి, నేను నా జీవితం లో రాజకీయాలతో సంబంధం లేకుండానే ఉండాలని కోరుకుంటాను, అలాగే ఉంటాను కూడా’ అని సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఆమె అభిమానులు సమంత స్పందించిన తీరుని మెచ్చుకుంటున్నారు.