Abortions Increased In Telangana: కొంతమంది సంతానం కోసం ఆరాటపడుతూ ఉండగా.. మరికొంతమంది సంతానం కావద్దని అబార్షన్లు చేసుకుంటూ ఉన్నారు. ఇలా చేసుకుంటూ ఉండే వారి సంఖ్య గతంలో కంటే ఇప్పుడు బాగా పెరిగిపోయిందని కొన్ని లెక్కలను బట్టి చూస్తే తెలుస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 11 నుంచి 12 లక్షల వరకు అబార్షన్లు జరుగుతున్నట్లు కొన్ని లెక్కలను బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే ఇటీవల బయటపెట్టిన ఓ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఎక్కువగా అబార్షన్లు పెరిగాయని తేలింది. ఆ వివరాలు లోకి వెళ్తే..
Also Read: ‘రావు బహదూర్ ‘ సినిమా టీజర్ ఏంటి భయ్యా ఇలా ఉంది…రాజమౌళి ట్వీట్ సంగతేంటి..?
కొంతమంది గర్భం వద్దనుకునేవారు.. ఇతర సమస్యలు ఉన్నవారు అబార్షన్లు చేయించుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం గర్భనిరోధం కోసమే అబార్షన్లు అవుతున్నట్లు తేలుతుంది. 2020-21 సంవత్సరంలో తెలంగాణలో 1578 అబార్షన్లు జరగగా.. 2024-25 సంవత్సరంలో 16,059 అబార్షన్లు జరిగాయి. అంటే గత మూడేళ్లలో 917% కేసులు పెరిగాయి. అదే ఆంధ్రప్రదేశ్లో 2024 -25 లో 10,676 కేసులు నమోదయ్యాయి. అబార్షన్లపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక అవగాహనలు కల్పిస్తున్నారు. గర్భం రాకుండా ఉండడానికి రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. కొందరు అబార్షన్ల వైపు పోకుండా మాత్రాలను వేసుకోవాలని సూచిస్తున్నారు. కానీ అనుకోకుండా వచ్చిన గర్భం వల్ల కూడా ఈ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రక్షణ చర్యలను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే దేశవ్యాప్తంగా చూస్తే కేరళలో అత్యధికంగా 25, 884 కేసులు నమోదయ్యాయి. అయితే అబార్షన్లు ఎక్కువగా కావడం వల్ల మహిళల్లో అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశముంది. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఎక్కువ శాతం పట్టణాలు, నగరాల్లో ఉండేవారు అబార్షన్లు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అనుకోకుండా కలయిక వల్ల లేదా కొన్ని రకాల కారణాల వల్ల ఆకస్మిక గర్భం రావడం.. దీంతో ఏం చేయాలో తెలియక అబార్షన్ కి మొగ్గు చూపడం వంటివి చేస్తున్నారు.
గర్భం రాకుండా కొందరు అనేక మాత్రలు తీసుకుంటున్నారు. కానీ ఈ మాత్రల వల్ల తర్వాతి కాలంలో అండం విడుదల అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఫలితంగా అబార్షన్లు చేయించుకోవడమే సరైన మార్గమని అనుకుంటున్నారు. అయితే తాత్కాలికంగా ఇది సరైన మార్గమే అనిపించినా.. ఆ తర్వాత కాలంలో ఎన్నో రకాల నష్టాలను చేకూరుస్తాయని కొందరు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.