Husband catches wife with lover: నేటి కాలంలో వివాహేతర బంధాలు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో వివాహ వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. మనదేశంలో వివాహ వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. కానీ, నేటి కాలంలో అది పూర్తిగా మారిపోతుంది
వివాహేతర సంబంధాలు బయటపడినప్పుడు జరిగే అనర్ధాలు మామూలుగా ఉండవు. కొన్ని సందర్భాలలో అవి ఘోరాలకు, దారుణాలకు దారితీస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఘోరాలకు, దారుణాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు పడుతుంటాయి. అయినప్పటికీ చాలామందిలో మార్పు రావడం లేదు. పైగా అనైతికమైన కార్యకలాపాలకు పాల్పడే క్రమంలో చాలామంది విచక్షణ కోల్పోతున్నారు.
కొన్ని సందర్భాలలో భార్య లేదా భర్త వివాహేతర సంబంధాలకు పాల్పడినప్పుడు..అవి వెలుగులోకి వచ్చినప్పుడు.. జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా వీడియోలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం డాకాలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ జరుగుతోంది. అక్కడికి ఓ యువతి వచ్చింది. ఆమె వెంట ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. చూసేవాళ్ళకు వారు ఇద్దరు దంపతులుగా కనిపించారు. ఇంతలోనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చీ రావడంతోనే ఆ యువతిని జుట్టు పట్టుకొని కొట్టాడు. అంతేకాదు తీవ్రంగా దూషించాడు. పొట్టలో తన్నాడు. ఇదంతా చూస్తున్న వారికి భయంగా అనిపించింది. కానీ ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు చూస్తుంటే.. అతడు ఆమె భర్త అని తెలిసింది.
వారిద్దరికీ చాలా రోజుల క్రితమే వివాహం జరిగింది. అయితే ఆ భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అంతే కాదు, భర్తను దూరం పెట్టడం మొదలుపెట్టింది. కొద్దిరోజులుగా భార్య ప్రవర్తన తీరుపై అనుమానం పెంచుకున్న అతడు.. చివరికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అంతేకాదు ఆమెను విపరీతంగా కొట్టాడు.