HomeతెలంగాణKarimnagar: కరీంనగర్‌ బాలిక హైదరాబాద్‌లో లభ్యం.. అసలు ఎందుకు పారిపోయింది.. ఏంటి కథ?

Karimnagar: కరీంనగర్‌ బాలిక హైదరాబాద్‌లో లభ్యం.. అసలు ఎందుకు పారిపోయింది.. ఏంటి కథ?

Karimnagar: దేశంలో చిన్న పిల్లలు, బాలికల మిస్సింగ్‌ కేసులు ఏటా పెరుగుతున్నాయని క్రైం బ్యూరో ఆఫ్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. మిస్సింగ్‌ కేసుల కట్టడికి చర్యలు తీసుకోవాలని, మిస్‌ అయినవారిని త్వరగా పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో 13 ఏళ్ల చిన్నారి రెండు రోజుల క్రితం మిస్‌ అయింది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకన్న పోలీసులు ఐదు బృందాలతో గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఏం జరిగిందంటే..
కరీంనగర్‌ జిల్లాలో కలకలం చేపిన 13 ఏళ్ల బాలిక వశిష్ట రెండు రోజుల క్రితం నగరం శివారులోని బైపాస్‌లో అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అలర్ట్‌ అయిన కరీంనగర్‌ పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. ఇందుకోసం ఐదుప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. నగరం అంతా జల్లెడ పట్టారు. చివరకు వశిష్ట ఆచూకీనిఇ హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో కనుగొన్నారు. అక్కడ వశిష్టను అక్కున చేర్చుకున్నారు. చిన్నారి భయంతో ఉండడంతో తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్తామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వశిష్ట అమ్మ కావాలని ఏడవడం మొదలు పెట్టింది. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వశిష్ట మిస్సింగ్‌ కథ సుఖాంతమైంది.

ఎందుకు హైదరాబాద్‌ వెళ్లింది..
అయితే కరీంనగర్‌ ౖ»ñ పాస్‌లో మిస్‌ అయిన వశిష్ట అసలు హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లారా.. లేక తెలియకుండానే ఆమె బస్సు ఎక్కి వెళ్లిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం మిస్‌ అయిన వశిష్ట రెండు రోజులు ఎక్కడ ఉంది అన్నది తెలియాల్సి ఉంది. రెండు రోజులు ఎలా గడిపింది అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వశిష్ట భయపడుతుండడంతో ఏమీ అడగలేకపోయారు. తర్వాత విచారణ చేపడతామని పేర్కొంటున్నారు. వశిష్ట కోసం రాత్రి పగలు నిర్వరామంగా గాలించి చిన్నారిని సేఫ్‌గా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులను ఆమె తల్లిదండ్రులు, స్థానికులు అభినందిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version