Kalvakuntla Kavitha : కవితకు షాక్‌.. ఆమెకు వ్యతిరేకంగా 92 డాక్యుమెంట్లు.. 44 సాక్షుల వాంగ్మూలం..

ఇప్పటికే ఈడీ చార్జిషీట్‌లో కీలక ఆధారలు చూపింది. ఇక సీబీఐ ఏం చూపుతుందో అన్న టెన్షన్ కవిత తరఫు లాయర్లలో, బీఆర్‌ఎస్‌ నేతల్లో నెలకొంది.

Written By: NARESH, Updated On : June 3, 2024 4:44 pm

Kalvakuntla Kavitha

Follow us on

Kalvakuntla Kavitha : ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టు షాక్‌ ఇచ్చింది. సీబీఐ కేసులో ఆమె జుడీషియల్‌ కస్టడీని జూన్‌ 7వ తేదీ వరకు పొడిగించింది. ఈమేరకు సోమవారం(జూన్‌ 3న) ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈడీ కేసులో కవిత జుడీషియల్‌ రిమాండ్‌ను జూలై 3వ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించింది.

కీలక ఆధారాలు..
ఇక ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఈడీ కీలక ఆధారాలు కోర్టుకు సమర్పించింది. లిక్కర్‌ కుంభకోణం మొత్తం విలువ రూ.1,100 కోట్లని తెలిపింది. ఇందులో కవితే కీలకమని పేర్కొంది. ఆప్‌ పార్టీకి లంచాలు ఇవ్వడంలో కవితే కీలకంగా వ్యవహరించారని, మధ్యవర్తిగా డబ్బులు ఇప్పించారని ఆరోపించింది.

92 డాక్యుముంట్లు..
ఇక మధ్యంతర చార్జిషీట్‌లో ఈడీ కవితకు వ్యతిరేకంగా 92 డాక్యుమెంట్లను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. 292 కోట్ల వ్యవహారంలో కవితకు నేరుగా సంబంధం ఉందని తెలిపింది. ఇక కవితకు వ్యతిరేకంగా ఉన్న 92 సాక్షాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ కోర్టుకు సమర్పించింది. ఇదే సమయంలో ఈ కేసులో అప్రూవర్‌గా మారిన శరత్‌దంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై తదితరులతోపాటు 44 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా ఈడీ కోర్టు ముందు ఉంచింది. ఈమేరకు చార్జిషీట కాపీని కోర్టు కవిత తరఫు లాయర్లకు అందించింది.

జూలైలో ట్రయల్‌..
ఇక కవిత నేరం చేసినట్లు తమ వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. పీఎంఎల్‌ఏ కింద కవితను శిక్షించాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలో జూలై నుంచి ఈ కేజుకు సంబంధించి ట్రయల్స్‌ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ట్రయల్స్‌ సుదీర్ఘంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కీలకమైన కేసు అయినందున వాదనలు కూడా సుదీర్ఘంగా జరుగుతాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

సీబీఐ చార్జిషీట్‌?
ఇక సీబీఐ కేసులో కూడా కవితకు మరో షాక్‌ తగలనుంది. త్వరలోనే కవిత కేసుకు సంబంధించి చార్జిషీట్‌ దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈడీ చార్జిషీట్‌లో కీలక ఆధారలు చూపింది. ఇక సీబీఐ ఏం చూపుతుందో అన్న టెన్షన్ కవిత తరఫు లాయర్లలో, బీఆర్‌ఎస్‌ నేతల్లో నెలకొంది.