Black Money: ఆ అధికారి తెలంగాణ రాష్ట్రంలో కీలక శాఖను పర్యవేక్షిస్తున్నారు. గతంలో దక్షిణ తెలంగాణ, తెలంగాణలోని పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు. గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక అధికారిగా కూడా పనిచేశారు. విధి నిర్వహణలో అవకతవకలు జరిగినా.. పెద్దగా బయటికి రానిచ్చేవారు కాదు. అయితే ప్రస్తుతం ఓ కీలక శాఖకు ఆయన కమిషనర్ గా పని చేశారు. ఆ సమయంలో దాదాపు 50 కోట్ల వరకు ఆయన వెనకేసుకున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని గులాబీ పార్టీకి అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా గ్రూపులు తెగ ప్రచారం చేస్తున్నాయి.
గతంలో ఆ అధికారి భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. అప్పటి ప్రభుత్వ పెద్దలతో అంటకాగారు.. తన సతీమణి కూడా కీలకమైన పోస్టింగ్ ఇప్పించుకున్నారు. దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో ఆమె, ఆయన కలిసి పనిచేశారు. ఆ తర్వాత వేరే ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ ఒకే జిల్లాలో తమ ఇద్దరికీ పోస్టింగులు ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వారిద్దరు కలిసి పనిచేస్తున్నారు. అయితే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులను కాకా పట్టడంలో ఈ అధికారి ఆరితేరిపోయారు. భారీస్థాయిలో అవినీతికి పాల్పడినప్పటికీ దానికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా బయటికి రానివ్వకుండా చూసుకోవడం ఈ అధికారి స్పెషాలిటీ. అయితే హైదరాబాదులో కీలక శాఖలో పనిచేస్తున్నప్పుడు ఏకైకన 50 కోట్ల డబ్బును ఆయన వెనకేసుకున్నారు. ఓ కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో కలగజేసుకున్న ఈ అధికారి.. అనుకూలంగా వ్యవహరించారు. దీనికి ఒక మంత్రి కూడా తోడు కావడంతో అధికారికి అడ్డు అనేది లేకుండా పోయింది. ప్రభుత్వం నుంచి కూడా సపోర్టు దండిగా రావడంతో భారీగానే ఆ అధికారి వెనకేసుకున్నారు.
గులాబీ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో తెగ ప్రచారం జరుగుతోంది. ఆ అధికారి మొదటినుంచి కూడా ఇలాంటి తెర వెనుక వ్యవహారాలు నడపడంలో సిద్ధహస్తుడు. పైగా తాను చేసే ప్రతిపనికి ఒక రేటు ఫిక్స్ చేసుకున్నారు. అందువల్లే ఈ స్థాయిలో సంపాదించారు. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేసినప్పుడు భారీగానే కూడబెట్టారని.. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారని.. మొత్తంగా తన పదవిని అడ్డుపెట్టుకొని దర్జాగా వెనకేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత జరిగినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఆ అధికారిపై అంతర్గతంగా విచారణ మొదలుపెట్టలేదు. అంటే ఆ అధికారికి ప్రభుత్వం సపోర్టు ఉందనే కదా అని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు.