HomeతెలంగాణCongress: ఏటా 120 కోట్లు.. 500 యూట్యూబ్ చానెల్స్.. కాంగ్రెస్ ప్లానంట.. ఈ ప్రచారంలో నిజమెంత?

Congress: ఏటా 120 కోట్లు.. 500 యూట్యూబ్ చానెల్స్.. కాంగ్రెస్ ప్లానంట.. ఈ ప్రచారంలో నిజమెంత?

Congress: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చా. మరి ఎంతోమంది ముఖ్యమంత్రులయ్యారు. కానీ జగన్, కెసిఆర్ మాత్రమే సొంతంగా మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. మిగతా వాళ్లకు లేవా? అనే ప్రశ్న ఎదురు కావచ్చు. కాకపోతే వారు పరోక్షంగా తమను సమర్థించేలా మీడియా సహకారాన్ని కోరుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులకు అధికారం లేదు. ఎమ్మెల్యేలుగా మాత్రమే ఉన్నారు. కెసిఆర్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అది కూడా లేదు. ప్రతిపక్ష హోదా కోసం ఆయన పోరాడుతున్నారు.. అయితే ఈ రెండు పార్టీల అనుకూల వ్యక్తులు మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. రోజుకో తీరుగా సంచలన వార్తలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. ట్విట్టర్లో కనిపిస్తున్న వీడియో ప్రకారం.. జర్నలిస్టు శంకర్ అనే ఒక వ్యక్తి.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈయన భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. జరిగిన తప్పులను ఒక్కటి కూడా సామాజిక మాధ్యమాల వేదికగా బయటకు తీసుకురాలేదు. పైగా గ్రూప్స్ కు అప్లై చేసుకున్న అభ్యర్థి ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే దానికి ప్రేమ వ్యవహారమే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ కృంగిపోయినప్పుడు.. అది ప్రతిపక్షాల కుట్ర అని తేల్చిపడేశారు. అయితే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అయితే దీనికి ఆధారాలు ఉన్నాయా? ఎవరిదైనా వివరణ తీసుకున్నారా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈయన చేసిన వ్యాఖ్యలు మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి.

120 కోట్లు సంవత్సరానికి..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో వ్యతిరేకత పెరిగిందట. ఎన్నికల ముందు ఇచ్చినట్టుగా ఆరు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతోందట. ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉన్న నేపథ్యంలో దానిని తగ్గించడానికి 500 వరకు యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిందట. దీనికోసం ప్రతి ఏడాది 120 కోట్లు ఖర్చు చేయాలని భావించిందట. ఈ విషయం జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తికి తెలిసిందట.. దీంతో ఆయన నిర్మొహమాటంగా ఈ విషయాన్ని చెప్పేస్తున్నాడట.. వాస్తవానికి ముందే మనం చెప్పుకున్నాం కదా.. నిజం గడప దాటేలోపు.. అబద్ధాలు ఊరు మొత్తం తిరిగి వస్తాయని.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అనే ముద్ర వేసుకుంటున్నాడు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం.. చేతిలో మైక్ పట్టుకోవడం.. ఇష్టానుసారంగా అరవటం.. సంబంధం లేని తంబ్ నైల్స్ పెట్టటం.. అనేవి పరిపాటిగా మారాయి. ఆ జాబితాలోకి శంకర్ చేసిన వ్యాఖ్యలు కూడా వస్తాయి. విషయం మీద పరిజ్ఞానం లేకపోవడం.. ప్రజల్లో విషాన్ని నింపడం.. అంశాల మీద పట్టు లేక అడ్డదిడ్డంగా అరవడం.. నేడు జర్నలిజంగా కొనసాగుతోంది. అలాంటి వాటినే ప్రజలు కూడా చూడడం నిత్య కృత్యమవుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular