
బీజేపీ ఒక్క సీటు గెలవగానే ఎగిరిపడడం సరికాదన్నారు. అతిగా ప్రవర్తించిన పోలీసు అధికారులను కట్టడి చేయడంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విఫలమయ్యారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. బుధవారం ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ
దుబ్బాక ఫలితం తరువాతనైనా కేసీఆర్ తన తీరు మార్చకోవాలని, నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో కవితను ఓడించినా కేసీఆర్ లో మార్పు రాలేదన్నారు. రైతుల ఉద్యమానికి టీడీపీ అండగా ఉంటదన్నారు. వరద సాయంలో టీఆర్ఎస్ నాయకులు కమీషన్ తీసుకోవడం సిగ్గు చేటన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బలంగా ఉన్నచోట టీడీపీ పోటీ చేస్తుందన్నారు.