
వరంగల్ జిల్లా కొడగండ్లలో మినీ టెక్సటైల్ పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరిన నేపథ్యంలో టెక్సటైల్ పార్కుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ప్రగతిభవన్ లో చేనేత, జౌళిశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవర్ లూం కార్మకులను ఆదుకునేందుకు బతుకమ్మ చీరెల తయారీని ఈసారి కూడా కొనసాగిస్తున్నామన్నారు. గతంలో ప్రారంభించిన నేతన్నకు చేయూత కార్యక్రమం ద్వారా కరోనా సంక్షోభంలోనూ కార్మికులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేయూర్చామన్నారు.కాలపరిమితి కన్నా ముందే తమ పొదుపుతో పాటు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ను ఒకేసారి వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపు ద్వారా సుమారు 25 వేల మందినేతన్నల కుటుంబాలకు ఆదా కలుగుతుందన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో టెక్సటైల్, చేనేత రంగాలనే కేటాయింపులపై కసరత్తు చేసి నివేదిక తయారు చేయాలని ఆ శాఖ అధికారులకు మంత్రి సూచించారు.