
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా బొమ్మరాసిపేట మండలం లగచర్ల గ్రామానికి చెందిన సురేశ్, హనుమంత్ గురువారం ఉదయం నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రానికి వచ్చారు. తిరిగి వెళ్తుండగా హకీంపేటలో వీరి ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో సురేశ్, హనుమంతు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మ్రుతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోద చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.