
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా అధికార టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు లేదని ఇరు పార్టీలు ప్రకటించాయి. దీంతో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను వేరు వేరుగా బరిలో నిలబెట్టాయి. కాగా ఇప్పటికే ఎంఐఎం ఎమ్మల్యే మహ్మద్ ఖాన్ టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. తాము తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొడుతామని తెలిపారు. తాజాగా ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నాయకులను ఎంఐఎం నాయకులు అడ్డుకున్నారు. ముస్లింలు అధికంగా ఉండే సపోటాబాగ్ బస్తీలో మంగళవారం టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ప్రచారం చేయడానికి వెళ్లడంతో అక్కడి ఎంఐఎం నాయకులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు.