
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తునాన్రు. గత నెల 28న కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరి 16 రోజులపాటు చికిత్స పొందారు. వారం రోజుల కిందట పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకొని ఇంటికి వస్తారనుకునే సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో న్యూమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. దీంతో శుక్రవారం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా నాయిని భార్య అహల్య, అల్లుడు విశ్రీనివాసరెడ్డి, పెద్ద కుమారుడి మనువడికి కూడా కరోనా సోకి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.