
ధరణితో ప్రజల ఆస్తులకు కొత్తగా భద్రత వస్తుందని ప్రభుత్వం నమ్మించిందని జగ్గారెడ్డి విమర్శించారు. ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గరే ఉన్నాయని, ఆస్తుల వివరాలు మీకెందుకు అని అధికారులు నిలదీస్తున్నారని అన్నారు. సీఎం తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. నిజాం కాలం నుంచే ఆస్తులకు భద్రత ఉందని, ఏ అధికారి ఇలాంటి సూచనలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని జాగ్గారెడ్డి పేర్కొన్నారు.